దారుణమైన సంఘటన : ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌.. మీరు జాగ్రత్త పడండి

1068

మృత్యువు ఏ వైపు నుండి వస్తుందో ఎవరు ఊహించలేరు. ప్రతి జీవి ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే. అయితే అది జాగ్రత్తగా ఉండకుంటే త్వరగా వస్తుంది.. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే చావు అనేది ఆలస్యం అవుతుంది. ఆ ఏముందిలే అనుకుంటే మాత్రం దారుణాలు జరుగుతాయని మరోసారి నారాయణపేటకు చెందిన వసంతరావు విషయంలో నిరూపితం అయ్యింది. దోమలను చంపేందుకు ఉపయోగించే మష్కిటో కాయిల్‌ అజాగ్రత్తతో ఉండటం వల్ల ఆయన ప్రాణాలను తీసింది.

Related image

నారాయణపేటలోని బ్రహ్మణవాడకు చెందిన వసంతరావు మరియు షాలిని దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. వృద్యాప్యం వల్ల వసంతరావు మంచానికే పరిమితం అయ్యాడు.ఆయన మంచి నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.అనారోగ్యం కారణంగా కొన్ని వారాలుగా వసంతరావు మంచం మీద నుండి లేచి తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేక పోతున్నాడు. ఒక రోజు రాత్రి ఈ వృద్ద దంపతులు ఇంట్లో దోమలు మరీ ఎక్కువగా ఉండటంతో మష్కిటో కాయిల్‌ను వెలిగించారు. వసంతరావు ఉన్న రూంలో కాకుండా షాలిని మరో చోట పడుకుంది. వసంతరావు పడుకున్న మంచంకు చాలా దగ్గరగా మష్కిటో కాయిల్స్‌ను షాలిని పెట్టింది. ప్రతి రోజు కూడా అలాగే పెడుతుంది కాని ఈసారి మాత్రం ఆమె అలా పెట్టినందుకు బాధపడే సంఘటన జరిగింది. మష్కిటో కాయిల్‌ ఫ్యాన్‌ గాలికి మంట అంటుకుంది. ఆ మంట మొదట బెడ్‌ షీట్‌కు అంటుకుని, ఆ తర్వాత మంచంకు అంటుకుంది. మంట పెరుగుతున్నా కూడా వసంతరావు లేవలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఆయన అరిచాడు. షాలిని వచ్చేప్పటికి జరగకూడనిది జరిగిపోయింది. వసంత రావు మంటల్లో బాగా కాలిపోయాడు.

ఈ క్రింద వీడియో చూడండి

వెంటనే అతనిని దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయలేమని చెప్పడంతో జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స చేయిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఒక మస్కిటో కాయిల్ ప్రాణాలు తీయడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ దారుణం స్థానికంగా అందరితో కన్నీరు పెట్టించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టం చెయ్యడానికి మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. చూశారుగా మస్కిటో కాయిల్ ఎంత పని చేసిందో. కాబట్టి వసంతరావు మరణంతో అయినా అంతా జాగ్రత్తగా ఉండండి. మస్కిటో కాయిల్స్‌ను కాస్త దూరంగా పెట్టండి.వాటికి కాగితాలు మరియు ఇతరత్ర మంట అంటుకునే వస్తువులకు దూరంగా ఉంచండి. ముసలి వారికి పిల్లలకు అసలు మష్కిటో కాయిల్స్‌ పెట్టకుంటే బెటర్‌. మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.