బ్యూటీపార్లర్ లో వ్య‌భిచారం వీరి బిజినెస్ సీక్రెట్ తెలిస్తే షాక్

620

ఇప్పుడు కొన్ని బ్యూటీ పార్ల‌ర్లలో, స్పా ముసుగుల్లో చీక‌టి దందాలు జ‌రుగుతూ ఉన్నాయి.. అందుకే ఎక్క‌డ నిజంగా పార్ల‌ర్ న‌డుస్తుంది అనేది తెలియ‌డం లేదు.. ఇక అమ్మాయిలు అక్క‌డ‌కు వ‌స్తున్నారు అంటే వారు బిజినెస్ కు వ‌స్తున్నారా, లేదా బ్యూటీ టిప్స్ కోసం వ‌స్తున్నారా అనేది తెలియ‌డం లేదు అనేది, పోలీసులు చెబుతున్నమాట.. అయితే ఇప్ప‌టికే అనేక కంప్లైంట్లు రావడం వ‌ల్ల అటువంటి పార్ల‌ర్లు స్పాల‌లో చెకింగ్ జ‌రుగుతూనే ఉంది. పోలీసులు ఇలాంటి వాటిపై ఓ నిఘా కూడా పెడుతున్నారు.. హైద‌రాబాద్ విశాఖ‌లో ఇటీవ‌ల ఈ చీక‌టి దందా పెరిగిపోయింది. వీరిని ప‌ట్టుకుని అరెస్ట్ చేసి ఆ పార్ల‌ర్ల‌ను మూయించారు.. అయితే ఇప్పుడు ఈ జాడ్యం విజ‌య‌వాడ‌కు కూడా పాకింది.

Related image

తాజాగా విజయవాడలో వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు.. విజయవాడ నగరం మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలో నెలరోజుల క్రితం నుంచి నోవెల్‌ బ్యూటీపార్లర్‌ నడుస్తోంది. ఈ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో పోలీసులు అలర్టయ్యారు. అదను చూసుకుని పార్లర్‌పై దాడి చేశారు. అంతే నెల‌రోజులు క‌దా అయింది, మ‌న దందా ఇంకా ఎవ‌రికి తెలియ‌దు అని అనుకున్నారు. కాని వీరి చీక‌టి బాగోతం పోలీసుల‌కు తెలిసింది. ప‌క‌డ్బందీగా ప్లాన్ వేసిన పోలీసులు సీక్రెట్ గా ఇక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలుసుకున్నారు, వారికి వ‌చ్చిన ఇన్ఫ‌ర్మేష‌న్ క‌రెక్ట్ అని తేల‌డంతో ఇక వెంట‌నే రంగంలోకి దిగారు.. దీంతో వీరి బండారం బ‌య‌ట‌ప‌డింది.

Related image

నిర్వాహకురాలు నందినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయింది. నెలరోజుల క్రితం ప్రారంభించిన ఈ బ్యూటీపార్లర్‌లో వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు నందినితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి పార్ల‌ర్ ముసుగులో ఇలాంటి ప‌నుల‌కు పాల్పడుతున్నారు అని పోలీసులు తెలుసుకున్నారు. ఇక ఇప్పటికే విజ‌య‌వాడ‌లో అపార్ట‌మెంట్ల‌లో సీక్రెట్ గా చేస్తున్న వ్య‌భిచారం గుట్టుని కూడా ర‌ట్టు చేశారు పోలీసులు… ఇలా రాజ‌ధాని ప్రాంతంలో జ‌ర‌గ‌డంతో పోలీసులు మ‌రింత అల‌ర్ట్ అయ్యారు.

అయితే గ‌తంలో ఇలాంటి ప‌నులు చేసే వారు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత వారి ప్లేస్ లు మార్చుకుని కొత్త ప‌ద్ద‌తుల్లో వ్యాపారాలు చేస్తున్నారు అని, ఇలా వ్య‌భిచారానికి అల‌వాటు ప‌డిన వారు మార‌డం లేదు అని ప‌లు కేసుల్లో తెలుసుకున్నారు పోలీసులు, వీరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు, తాజాగా వాట్సాప్ కు ఫోటోలు పంపించి అక్క‌డే రేటు మాట్లాడుకుని పేటీఎం లేదా బ్యాంకు అకౌంట్ల‌కు డ‌బ్బులు పంప‌మ‌ని కోరుతున్నారు, ఇలాతాము చెప్పిన ప్లేస్ కు ఆ స‌మ‌యానికి రావాలి అని చెబుతున్నారు.. ఇలాంటి చీక‌టి రాకెట్ల‌ను పోలీసులు ఇటీవ‌ల పెద్ద ఎత్తున సీక్రెట్ గా ప‌ట్టుకుంటున్నారు. చూశారుగా ఇలాంటి అసాంఘిక చ‌ర్య‌లు మీ చుట్టుప‌క్క‌ల జ‌రిగితే వెంట‌నే పోలీసుల‌కు తెలియ‌చేయండి.