తల్లిలేని బిడ్డకు పాలిచ్చిన లేడీ కానిస్టేబుల్..దాంతో ఆమెకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా..

539

అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.బిడ్డ రక్షణ గురించి తప్ప ఆమెకు మరే ధ్యాస ఉండదు.ఆకలితో ఏడ్చే చంటిపాపని చూస్తే తల్లికి బిడ్డ కడుపునింపడం తప్ప మరో ధ్యాస ఉండదు..ఆ బిడ్డ తన బిడ్డ కాకపోయినా తన ,పర భేదాలు లేకుండా తన ఆకలి తీర్చి మాతృత్వం చూపించడమే తల్లికి తెలిసింది..అందుకే ఈ సృష్టిలో అమ్మ స్థానం ప్రత్యేకమైంది..అంతటి ప్రత్యేక స్థానాన్ని తన చర్యలతో ఎప్పటికప్పుడు నిలుపుకుంటూనే ఉంటుంది.ఇటీవల గస్తీ కోసం వెళ్లిన ఒక మహిళా కానిస్టేబుల్ కి ఆకలితో ఏడుస్తున్న చంటిబిడ్డ కనిపించిందే.అంతే తను ఒక పోలీస్ అని,ప్రస్తుతం డ్యూటిలో ఉన్నా అనే విషయం మర్చిపోయి తన మాతృప్రేమ చాటుకుంది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lady constable

అర్జెంటీనాకు చెందిన సెలస్టే జాక్వెలిన్‌ అయాలా అనే పోలీస్ సోల్జర్‌ ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసూతి సెలవులు అయిపోయాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయింది.విధుల్లో భాగంగా ఆస్పత్రిలో గస్తీకి వెళ్లింది. ఆస్పత్రిలో ఓ చిన్నారి ఆకలితో ఏడుస్తూ జాక్వెలిన్ కి కనిపించింది. పక్కన బిడ్డ తల్లి లేదు.బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంది.అంతే సెలస్టీ మాతృహృదయం ఉప్పొంగింది. నర్సుల అనుమతి తీసుకుని వెంటనే బిడ్డను ఒడిలోకి తీసుకుని స్తన్యం ఇచ్చింది.ఆకలితో ఏడుస్తున్న చంటిపాప వెంటనే ఏడుపు ఆపి పాలుతాగి ఆకలి తీర్చుకుని నిద్రపోయింది.అయితే ఆ బిడ్డ ఇటీవలే తల్లికి దూరం కాగా, హాస్పటల్ వారే పోషణ బాధ్యత చూసుకుంటున్నారు.ఈ విషయం తెలిసి ఆమె మనసు కరిగిపోయింది.ఆ బిడ్డను నేను పెంచుకుంటా అని తనతో పాటు తీసుకెళ్ళింది.అయితే ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

ఈ విషయం గురించి ఆమె స్పందిస్తూ..‘ఆ చిన్నారి ఏడుపు వినగానే నా బిడ్డ గుర్తొచ్చింది. పాలుపట్టాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నా స్థానంలో ఏ తల్లి ఉన్నా ఇలాగే చేసేది అంటూ స్పందించింది సెలస్టే..సెలస్టే పాలిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో చూసి నెటిజన్లంతా సెలెస్టా చేసిన పనిని అభినందిస్తున్నారు.ఈ ఘటన ‘జాతీయ మహిళా అధికారుల దినోత్సవం’ రోజునే చోటుచోసుకోవడం ఆశ్చర్యకరం.మరోవైపు తల్లిలేని బిడ్డకు పాలుపట్టిన సెలెస్టాను ప్రభుత్వం పదోన్నతి ఇచ్చి గౌరవించింది.చేసిన పుణ్యం ఉరికే పోతుందా చెప్పండి.ఈ విధంగా ఆమెకు లాభం చేకూరింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తల్లికి దూరమైన ఆ బిడ్డకు పాలిచ్చి అమ్మ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం మరొకసారి తెలియజేసిన ఆ మహిళా గురించి అలాగే అమ్మ గొప్పతనం గురించి అమ్మ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.