ప్రణయ్ హత్య పై KTR ఏమన్నారో చూడండి

418

న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ప‌రువు కుల హ‌త్య‌పై దేశంలో ద‌ళిత సంఘాలు అన్నీ తీవ్రంగా ఖండించాయి.. ఇక తెలుగు రాష్ట్రాల్లో దీనిపై అంద‌రూ విమర్శ‌లు చేస్తున్నారు.. ఇప్పుడు ఆ అబ్బాయిని చంపి సాధించింది ఏమిటి అని నిల‌దీస్తున్నారు, కుమార్తె పై ప్రేమ ఉంది అంటున్న ఆతండ్రి కుమార్తెను ఇప్పుడు భ‌ర్త లేకుండా చేశాడు అని విమ‌ర్శిస్తున్నారు . అయినా ఇంత కూడా ప‌శ్చాత్తాపం లేకుండా ఈ హ‌త్య చేసినందుకు, ఎటువంటి బాధ లేదు అంటున్నాడు అమృత తండ్రి మారుతీరావు . ఇక రాజకీయ నాయ‌కులు కూడా ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు, ఎమ్మెల్యే ఎంపీలు అలాగే అన్ని పార్టీల నాయ‌కులు వ‌చ్చి వారిని కలిసి దీనిని ఖండించారు.

Image result for ktr

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్యపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు, అతని భార్య అమృతకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు….ప్రణయ్‌ దారుణ హత్య తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. సమాజంలో కులతత్వం ఇంత బలంగా నాటుకుపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షపడుతుంది. బాధిత కుటుంబానికి న్యాయం లభిస్తుంది. ప్రణయ్‌ భార్య అమృత గారికి, అతని తల్లితండ్రులకు నా ప్రగాఢ సానుభూతి అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Image result for pranay and amrutha

అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగానే ప్రణయ్ ని దారుణ హత్యకు ప్లాన్ చేసి మ‌ర్డ‌ర్ చేశారు.. ఇక ప్రధాన నిందితుడు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌లతో పాటు సుఫారీ కిల్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై కాంగ్రెస్ నాయ‌కుడు ఓ ఎమ్మెల్యే కూడా వెనుక ఉన్నారు అనే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, వారిని కూడా విచారించే అవ‌కాశం ఉంది అలాగే ఈ హ‌త్య వెనుక ఓ లాయ‌ర్ కూడా ఉన్నారు అని తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఇలా అగ్ర‌కులాలు – నిమ్న‌కులాలు అనే భావ‌న‌ల‌తో హ‌త్య‌లు చేసుకుంటే, చివ‌ర‌కు మిగిలేది కులాలు మాత్ర‌మే, అంతే కాని మనుషులు కాదు అని గుర్తు ఉంచుకోవాలి. జాతి కులం మ‌తం అనేది మ‌నిషి పెట్టుకున్న క‌ట్టుబాట్లు, అంతేకాని దీనికి ఎటువంటి విధానాలు నిబంధ‌న‌లు మ‌న‌కు పుట్ట‌క‌తో లేవు అనేది గుర్తించండి, దేవుడికే లేని కులాలు మ‌నుషుల‌కు ఎందుకు అని ఒక్కసారి ఆలోచించండి, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.