కొండగట్టు బస్సు ప్రమాదంలో అధ్బుతం: ఏం జరిగిందో చూడండి

441

జగిత్యాల జిల్లా కొండగట్టు ద‌గ్గ‌ర జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదం అంద‌రిని క‌లిచివేసింది. కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్న ఆర్టీసీ బస్సు సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్ర‌యాణికులు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో గాయపడినవారి ఆర్ధనాదాలతో హృదయవిదారకంగా మారింది ఈప్రాంతం.. ప్ర‌యాణికుల‌తో ప్ర‌యాణిస్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 85 మందికి పైగా ప్రయాణికులు ఉన్నార‌ని అన్నారు.

Image result for bus accident

ఇక చ‌నిపోయిన వారిలో చిన్నపిల్ల‌లు మ‌హిళ‌లు ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌టం అంద‌రిని క‌లిచివేసింది.. వారి కుటుంబానికి ఇది ఎంత‌గానో తీర‌ని మ‌నో వేధ‌న‌గా మార్చేసింది.. మంగళవారం కావడంతో కొండగట్టుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ స‌మ‌యంలో బ‌స్సులో అధిక మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేయ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.. ఈస‌మ‌యంలో ఇద్ద‌రు పిల్లలు ఈ ప్ర‌మాదం నుంచి మృత్యుంజ‌యులుగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్పుడు వారి గురించే అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రాంసాగర్‌ గ్రామానికి చెందిన బైరి కీర్తన, కూతురు రితన్య, ఏడాది వయస్సున్న కుమారుడు శివతో కలిసి జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి.

Image result for bus accident

శివ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే.. రాంసాగర్‌ గ్రామానికే చెందిన కావ్యశ్రీ,, ఉదయశ్రీ అనే కవలలు తాత మెడిచెల్మల రాజేశంతో జగిత్యాల బయలుదేరారు. ప్రమాదంలో రాజేశం మృతిచెందగా.. కవలలు మృత్యుంజయులుగా నిలిచారు. దాదాపు బస్సులోని వారందరూ మృత్యుముఖానికి వెళ్లగా చిన్నారులు మాత్రం సురక్షితంగా బతికి బయటపడడంతో వారి బంధువులు విషాదంలో కూడా, ఈచిన్నారులైనా మిగిలారు ఆని ఆనందంలో ఉన్నారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణం అయిన డ్రైవ‌ర్ కూడా చికిత్స్ పొందుతూ మ‌ర‌ణించాడు, అలాగే అత‌నికి తీవ్ర ప‌నిఒత్తిడి వ‌ల్ల, సెల‌వులు లేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంది అని కూడా అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఉద్యోగుల‌కు స‌రైన సెల‌వులు ఇవ్వ‌డంలేదంటూ ఉన్న‌త అధికారుల‌పై సిబ్బంది ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.. వీరి వివాదాలు ఎలా ఉన్నా ప్ర‌యాణికుల ప్రాణాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని ప్ర‌జ‌లు తెలియ‌చేస్తున్నారు.. ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన చిన్నారులు, నిజంగా మృత్యుంజ‌యులు అనాల్సిందే.. మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.