సినీ ఇండస్ట్రీ లో ఘోరం :ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న టాప్ హీరోయిన్..శోక సంద్రంలో హీరోస్

560

కొలీవుడ్‌కు చెందిన వర్దమాన సినీ తార ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చెన్నైలో బుధవారం చోటుచేసుకుంది. వలసారవాకంలోని తన నివాసంలో నటి రియామికా (26) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన రియామిక, కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం సినిమాల్లో కథానాయికిగా మెప్పించారు.

శ్రీదేవికి కుప్పానికి చెందిన రియామిక, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి రియామికను చివరిసారిగా మంగళవారం ఉదయం కలిసినట్టు ప్రకాశ్ తెలిపాడు. అదే రోజు బయటకు వెళ్లిన ప్రకాశ్, తన సోదరికి బుధవారం అనేక సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో భయపడిన ప్రకాశ్ ఆమె స్నేహితుడు దినేశ్‌ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడని పేర్కొన్నాడు.

బుధవారం సాయంత్రం ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తన దగ్గర మరో తాళం చెవితో ప్రకాశ్ తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రోయాపెటా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదని, విచారణలో అన్నీ బయటపడతాయని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఎంటో తెలియలేదని పేర్కొన్నారు.