ప్రేమే ప్రాణంగా బతికిన ఒక గొప్ప ప్రేమజంట.. ప్రతి ప్రేమికులు తప్పక తెలుసుకోవాల్సిన రియల్ లవ్ స్టోరీ..

226

ప్రేమ… ఈ పదం గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరు.ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు.కొందరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తే కొందరి ప్రేమ ఏమో మధ్యలోనే ఆగిపోతుంది.ప్రేమ సఫలం అయితే ఎలాంటి డోకా ఉండదు కానీ విఫలం అయితేనే వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కొందరి ప్రేమకథలు వింటుంటే ఈ కాలంలో కూడా నిజమైన ప్రేమ బతికే ఉందని అనిపిస్తుంది. కష్టాలు ఉన్నప్పుడు వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది ప్రేమే కాదు. సమస్యల్లోనూ తోడు నిలిచేదే ప్రేమ. అలా నిలిచిన ఒక కథ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అది కదా కాదు. కేరళ ప్రేమికుల నిజజీవుల గాథ. మరి వారి ప్రేమ కథ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers

ఆ ప్రేమికుల పేర్లు సచిన్‌, భవ్య. వీళ్ళ ప్రేమకథ కేరళ, పాథుకల్‌ టౌన్‌లో మొదలైంది. సచిన్‌ ఇంటర్‌ తరువాత నిలంబూర్‌లో అకౌంటెన్సీ కోర్సులో చేరాడు. అక్కడే అతడికి భవ్య పరిచయమైంది. తక్కువ సమయంలోనే స్నేహితులయ్యారు. ఆరు నెలల తరువాత ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు అతను. కొన్నాళ్ల తరువాత సరేనంటూ ఆమోదాన్ని తెలిపింది. కొన్నిరోజులకు ఈ జంటను చూసిన భవ్య తల్లిదండ్రులు ఆమెతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సచిన్‌ పరిస్థితీ అంతే. తమ కోర్సు అయిపోగానే భవ్య ఒక ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగానికి చేరింది. కొన్నిరోజులకే వెన్నునొప్పి మొదలైంది. రెండు వారాలు చికిత్స తీసుకుంది. ఎంతకీ నొప్పి తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోంటే అనుమానం వచ్చి స్కానింగ్‌ తీయించారు. ఆ రిపోర్టులో ఎముక మీద చిన్న కంతి కనిపించింది. మళ్లీ పరీక్షలు చేయించుకుంటే ఎముక క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కీమోథెరపీ చేయాలన్నారు వైద్యులు. ఆమె కుటుంబ సభ్యులకు ఇది తలకు మించిన భారమే. దాంతో సచిన్‌ తన ప్రేమను దక్కించుకోవాలనుకున్నాడు.

Image result for lovers

ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్నేహితుల సాయం తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. కీమోథెరపీకి కావాల్సిన డబ్బును సమకూర్చే పనిలో పడ్డాడు.2018, మార్చి 21న ఆమెకు మొదటిసారి కీమో చేశారు. రేడియేషన్‌ ప్రభావం వల్ల ఆమె జుట్టంతా ఊడిపోయింది. చికిత్సకు ముందు గుండు చేయించుకుంది. ఆ సమయంలో ఆమెకు అండగా, తోడుగా ఉన్నాడు సచిన్‌. ‘క్యాన్సర్‌ వల్లే నాకు ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలిసింది’ అని అంటాడతను. రోజుకూలీకి వెళ్లి కూడా ఎంతో కొంత డబ్బు సంపాదించేవాడు. ఎంత కష్టమైనా సరే… ప్రేయసిని కాపాడుకోవాలనుకున్నాడు. స్నేహితుల సాయంతో సోషల్‌ మీడియాలో తన కథను పంచుకుని అవసరమైన డబ్బును సమకూర్చుకున్నాడు. అయిదు నెలల్లో ఆరుసార్లు కీమో చికిత్సలు జరిగాయి. అన్నింటినీ అతనే చేయించాడు. చివరకు ఇరు కుటుంబాల సమక్షంలో కిందటి నవంబరులో వాళ్ల పెళ్లి అయ్యింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అది జరిగిన కొన్నాళ్లకు శస్త్ర చికిత్స చేసి వెన్నుముకపై ఉన్న కంతిని విజయవంతంగా తొలగించారు. ఆ అమ్మాయికి దాదాపు పదమూడు కీమోలు జరిగాయి. మరో మూడు అయితే క్యాన్సర్‌ ప్రమాదం నుంచి బయటపడినట్లే అని అన్నారు వైద్యులు. ఇప్పుడు సచిన్‌ ఆ పనిలో ఉన్నాడు. ‘వందశాతం ఈ జబ్బు నయమవుతుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. మరో అయిదారేళ్లలో ఇది తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలా రాకుడదని మేం దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని అంటాడు సచిన్‌. చూశారుగా ఈ ప్రేమికుడు ప్రేమికురాలి కోసం ఎంతలా కష్టపడుతున్నాడో. భవ్యకు త్వరగా నయం అయ్యి వారి ప్రేమ కలకాలం ఉండాలని కోరుకుందాం. మరి సచిన్ భవ్యల ప్రేమకథ గురించి అలాగే ప్రేమించినవారి కోసం ఎంత కష్టమైనా పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.