భార్యకు క్యాన్సర్.. ఈమె భర్త చేసిన పనేంటో తెలిస్తే షాక్..ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి

335

ప్రేమంటే ఇద్దరు మనుషుల పరిచయం మాత్రమే కాదు రెండు మనసులు కలిసి చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంతటి కష్టం ఎదురైనా ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ పవిత్ర బంధంగా కలకాలం వర్ధిల్లుతుంది. చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి కొన్ని ప్రేమ జంటలే రోమియో-జూలియట్, లైలా-మజ్నూ. ఇలాంటి ఎందరో ప్రేమికుల ప్రేమకథలు కంచికి చేరని కథలుగా మిగిలిపోతున్న ఈరోజుల్లో కేరళకు చెందిన ఈ ప్రేమ జంట కష్టనష్టాలను ఎదిరించి నిజమైన ప్రేమంటే ఏంటో నిరూపించింది. వాస్త‌వంగా ఇలాంటి వారు చాలా త‌క్కువ మంది ఉంటారు. త‌మ జీవిత భాగ‌స్వామీనే త‌మ జీవితం అని అనుకునే వారు కొంద‌రు అయితే. భార్య‌ని ఇంటికి మాత్ర‌మే ప‌రిమితం చేసే వారు కొంద‌రు ఉంటారు. కొంద‌రి జీవితాల్లోకి ఎవ‌రు అడ్డు వ‌చ్చినా వారి ప్రేమ చిర‌స్ధాయిగా నిలిచిపోతుంది. తప్ప‌కుండా ఈ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలి.

కేరళలోని త్రిసూరుకు చెందిన షాన్ ఇబ్రహిం బాద్షా, శ్రుతి కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రుతి అనారోగ్యం బారిన పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శ్రుతి ఆరోగ్యానికి సంబంధించి ఓ భయంకర నిజాన్ని వెల్లడించారు. శ్రుతికి క్యాన్సర్ ఉందని చెప్పడంతో రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు లోనయ్యాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసి షాన్ తట్టుకోలేకపోయాడు. గుండెలవిసేలా రోదించాడు. అయితే.. ఆమెను ఎలాగైనా బతికించుకోవాలన్న షాన్ సంకల్పమే శ్రుతికి ఊపిరి పోసింది.

శ్రుతికి క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ మొదలుపెట్టారు. ఆ చికిత్స ప్రభావంతో శ్రుతి జుట్టు ఊడిపోయింది. ఆ సమయంలోనే షాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఆ స్థితిలో ఉన్నప్పుడు తనకు మాత్రం జుట్టు ఎందుకనుకున్నాడు. అతను కూడా గుండు చేయించుకున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రుతికి షాన్ అన్నీతానై అండగా నిలిచాడు. ఇప్పుడు ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుంది. వీరి పెళ్లయి సంవత్సరం అయిన సందర్భంగా షాన్ తన ప్రేమకథను గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు శ్రుతి తోడుగా నిలిచి భరోసానిచ్చిందని, అలాంటి తన శ్రుతి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని షాన్ చెప్పాడు. ఇలా షాన్-శ్రుతి ప్రేమకథ వెలుగులోకొచ్చింది.