మీ వల్లే వరదలు అంటూ తమిళనాడు కు దిమ్మతిరిగే షాకిచ్చిన కేరళ ప్రజలు

368

కేరళ పరిస్థితి ఇప్పుడు కొద్దిగా సద్దుమణిగింది.ఇన్ని రోజులు పడ్డ కష్టం నుంచి జనాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.వరదల ధాటికి కకావికలం అయినా వారి జీవితం కుదుటపడటానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే వారికి ఇంత పెద్ద కష్టం రావడానికి కారణం ఎవరు.100 ఏళ్ల తర్వాత అంత భయంకరమైన వరదలు రావడానికి కారణం ఏమిటి అంటే ప్రకృతి స్ప్రుష్టించిన భీభత్సం అని అంటారా..మరి కేరళ వాసులు ఏమంటున్నారో తెలుసా..ఇంత పెద్ద ముప్పు జరగడానికి కారణం తమిళనాడు అని అంటుంది.తమిళనాడు ఎలా కారణం అని అనుకుంటున్నారా..పూర్తీగా చెబుతా వినండి.

Ravaging Kerala Floods Match Climate Change Forecast, But There's More

తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసింది. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది.ఈ మేరకు కేరళ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముళ్ల పెరియార్ డ్యాం నుంచి భారీగా నీరు రావడంతో ఇడుక్కి డ్యాం 15 గేట్లు ఎత్తివేశామని, దీంతో కేరళ అల్లకల్లోలంగా మారింది ఆరోపించింది.తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లపెరియార్ డ్యాంను కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని నిర్వహణ తమిళనాడు రాష్ట్రానిదే. డ్యాం పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యాం కట్టాలని కేరళ చాలాకాలంగా చెబుతోంది. డ్యాంలో నీటిస్థాయిని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. తమిళనాడు నుంచి ఆశించిన స్పందన లేదు. ఈ కారణంగా డ్యాం నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే కేరళ ఇంత నష్టపోయిందని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టులో చెప్పింది.

Image result for kerala flood

కేరళ జనాభా 3.48 కోట్లు. ఇందులో 54 లక్షల మంది ప్రజలు ఈ వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లా పెరియార్ నది సమీపంలోని థెక్కడి దగ్గరి వెస్టర్న్ ఘాట్ వద్ద ముళ్లపెరియార్ డ్యాం ఉంది. ముళ్లపెరియార్ డ్యాం నుంచి నీటిని క్రమంగా విడతలవారిగా విడుదల చేయాలని కోరామని, కానీ తమ విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ముళ్ల పెరియార్ డ్యాం కారణంగా ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్‌తో పాటు రెండు రాష్ట్రాలు సభ్యులుగా సూపర్ వైజరీ కమిటీ ఉందని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వరదలు వచ్చినప్పుడు లేదా ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ముళ్లపెరియార్ డ్యాం నిర్వహణపై కేరళ ప్రభుత్వం కూడా ఎప్పటికి అప్పుడు సమాచారం అడుగుతోందని చెప్పింది. కాగా, కేరళలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీసుకున్న చర్యలు, ఏం చేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆగస్ట్ 18న కేరళ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.విన్నారుగా ఇంత పెద్ద పెనుముప్పుకు తమిళనాడు ఎలా కారణం అయ్యిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ వరదల పరిస్థితి గురించి దాని వెనుక తమిళనాడు ఉందన్న కేరళ వాదన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.