కేరళ వరదల్లో మూగబోయిన ప్రేమ.లవర్ కోసం ప్రాణత్యాగం..ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

462

ప్రేమ అనేది చాలా గొప్పది.ఈ కాలంలో నిజమైన ప్రేమ లేదు అనే వాళ్ళు ఉన్నారు కానీ నిజమైన ప్రేమ ఉంది అని అనేవాళ్ళు అస్సలు లేరు.ఎందుకంటే ఈ కాలం ప్రేమికులు అలా ఉంటున్నారు.నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని చాలా సార్లు వినే ఉంటాం.ప్రేమంటే ఇదేరా అని సినిమాలలో చూస్తాం కానీ నిజమైన ప్రేమ అంటే ఏమిటో నిజమైన త్యాగం అంటే ఏమిటో ఎవ్వరికి తెలియదు.అయితే కేరళలోని ఒక గ్రామంలోని ప్రజలు నిజమైన ప్రేమను చూశారు.ఆ ఇద్దరి ప్రేమికుల ప్రేమను చూసి ప్రేమంటే ఇదే అనుకుంటున్నారు.మరి ఆ ప్రేమికుల గురించి తెలుసుకుందామా..

కేరళలోని చెంగనూర్ కు చెందిన జై శ్యామల గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటూన్నారు.వారి ప్రేమను పెద్దలకు చెప్పిన వారు ఒప్పుకోలేదు.పెళ్లి మాట ఎత్తితే మా శవాలు చూస్తారు అని బెదిరించారు.పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం.వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేద్దాం అని గత ఐదు నెలలుగా వెయిట్ చేస్తున్నారు.అలాంటి సమయంలో కేరళలో వరదలు మొదలయ్యాయి.తన లవర్ ఎలా ఉందో తెలుసుకుందామని జై శ్యామలకు ఫోన్ చేశాడు.నేను బాగానే ఉన్నా అమ్మానాన్నకు తెలిస్తే బాగుండదు.ఏమైనా సమస్య ఉంటె నేనే ఫోన్ చేస్తా అని ఫోన్ కట్ చేసింది.రోజురోజుకు వరద భీభత్సం పెరగడంతో వరదల్లో చిక్కుకుంది శ్యామల కుటుంబం.సహాయం కోసం ఎంత అల్లాడిన వారికి సాయం అందలేదు.వారి ఇల్లు దాదాపుగా మునిగిపోయింది.మరికొన్ని క్షణాల్లో వరదల్లో మునిగిపోతాం అనగా శ్యామలకు తన ప్రియుడు జై గుర్తుకొచ్చాడు.వెంటనే అతనికి కాల్ చేసింది.శ్యామల గొంతు వినగానే వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నాడు.రిస్కీ బృందానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడాడు.కానీ శ్యామల తండ్రిని కాపాడే సమయంలో అనుకోకుండా వరదల్లో పడి కొట్టుకుపోయాడు.అయ్యో అని అందరు అనుకునేలోపే వరదల్లో కొట్టుకుపోతు ఒక చెట్టుకు గుద్దుకుని అక్కడికక్కడే చనిపోయాడు.అది చుసిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక శ్యామల పరిస్థితి చెప్పరానిది.తను ఎంతగానమో ప్రేమించిన ప్రియుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి అది కూడా తన కుటుంబాన్ని కాపాడుతూ చనిపోవడం చూసి ఆమె మనసు ఆగలేదు.

ప్రియుడి కోసం వరదల్లో దూకబోయింది.కానీ ఆమె తల్లిదండ్రులు అడ్డుకున్నారు.ఈ ఘటన చుసిన అక్కడి ప్రజలు అయ్యో పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎంతలా అంటే నా కుతురునే లవ్ చేస్తావా అని చెంప మీద కొట్టిన మామగారే నన్ను కాపాడడం కోసం నువ్వు చనిపోయవా జై తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.అక్కడితో కథ ఆగిపోలేదు.అప్పుడే అసలు కథ మొదలైంది.శ్యామల ప్రియుడి కోసం ఏడిచి ఏడిచి గొంతు మూగబోయింది.ఇప్పుడు ఆమెకు మాట రావడం లేదు.డాక్టర్స్ ఎంత ప్రయత్నించిన ఆమెను నార్మల్ కండిషన్ కు తీసుకురాలేకపోతున్నారు.కూతురి పరిస్థితి చుసిన ఆ తల్లిదండ్రులు గత ఐదు నెలలుగా ఆమెను ఎంతలా బాధ పెట్టామో అర్థం చేసుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఈ విషాద ఘటన కేరళ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.ఇది చుసిన చాలా మంది నిజమైన ప్రేమ అంటే ఇదే అని అనుకుంటున్నారు.మరి ఈ విషయం మీద మీరేమంటారు.నిజమైన ప్రేమ అంటే వీళ్ళదే కదా.