తల్లిదండ్రులు చేసిన తప్పువల్ల ఈ ప్రేమ జంట ఎంత ఘోరం చేసిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

430

ప్రేమ… ఈ పదం ఈ మధ్య బాగా వినిపిస్తుంది.ప్రేమికులు ఈ మధ్యన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.మొన్న మిర్యాలగూడలో జరిగిన ఘటన గానీ ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన ఘటన గానీ ప్రేమికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాగానే చెప్పాయి.కులాలు వేరని మతాలు వేరని అంతస్తులు వేరని..ఇలా రకరకాల కారణాలు చెప్పి ప్రేమికులను విడదీస్తున్న వాళ్ళే ఉన్నారు.కొందరు ఆ బాధను తట్టుకుని జీవిస్తుంటే కొందరేమో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే ఉన్నారు.ఇప్పుడు మరొక ప్రేమ జంట అదే పని చేసింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

కేరళ రాష్ట్రం, ఎర్నాకుళం జిల్లా కూట్టుమడం ప్రాంతానికి అభిజిత్‌ (19) ఎర్నాకుళంలోగల కళాశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో చదువుతుండగా ఎర్నాకుళం జిల్లా నెల్లికుళికి చెందిన రూష్ణాపూసల్‌ (19)తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. అయితే వీరి ప్రేమ గురించి ఎలాగోలా ఇంట్లో వాళ్లకు తెలిసింది.వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు తెలిపి వారి అనుమతి కోరారు.అయితే, ఇరు కుటుంబాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.ఇరువురు తల్లిదండ్రులు వారిని మందలించారు.మీరు ఇక కలుసుకోకూడదని కండిషన్ పెట్టారు.ఇంట్లోనే బందించి ఆ ప్రేమికులను దూరం చేయాలనుకున్నారు.అయితే విడిపోయి బతకలేమని నిర్ణయించుకున్న ఆ ప్రేమ జంట గత వారం ఇంటి నుంచి పరారయ్యారు.

ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఆ ప్రేమ జంట చెన్నై చేరుకున్నారు. ఇరువురూ బసచేసేందుకు వీలులేక చెన్నై రైల్వేస్టేషన్‌లో గడిపారు. తాము తెచ్చుకున్న నగదు ఖాళీ కావడంతో ఆహారం లేకుండా అవస్థలు పడ్డారు. మంగళవారం రాత్రి చెన్నై సబర్బన్‌ రైల్వేస్టేషన్‌ 16 నంబర్‌ ప్లాట్‌ఫాంపై క్రిమిసంహారక మందు తాగి స్పృహ తప్పారు. అక్కడ రాత్రి గస్తీ తిరుగుతున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు గమనించి ఇద్దరిని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ గటనపై సెంట్రల్‌ రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.చూశారుగా ఈ ప్రేమ జంట ఎంతటి పని చేసిందో.చావడం కోసం అయితే ఇక ప్రేమించుకోవడం ఎందుకు చెప్పండి.అందుకే సమస్యలకు ఎదురొడ్డి నిలబడాలి కానీ ఎవరు ఇలా ఆత్మహత్య చేసుకోకండి.