కేరళ వరదల్లో ఈ మత్స్యకారుడు ఏం చేసాడో తెలిస్తే వీడురా రియల్ హీరో అంటారు

409

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి..ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముకం పట్టడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.అయితే సహాయ చర్యలు చేపడుతున్నప్పుడు ఒక మత్స్య కారుడు చేసిన పని అతనిపై ప్రశంసల జల్లు కురిసేట్టు చేస్తుంది.మరి ఆ మత్స్యకారుడు చేసిన పని గురించి తెలుసుకుందామా.

కేరళ వరద బాధితులను ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్‌లతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ కూడా సహాయం అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టోపీ లేని మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యంతో పాటు స్థానిక మత్స్యకారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మత్స్యకారులు కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు. ఓ వృద్ధురాలిని కాపాడేందుకు ఓ మత్స్యకారుడు తన వీపునే మెట్టుగా మార్చాడు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అతడు అందించాడు. తనూర్‌కు చెందిన జైసల్‌ కేపీ మత్స్యకారుడు. చిన్నపిల్లతో పాటు వరదల్లో చిక్కుకున్న ఓ తల్లి, వృద్ధురాలి ఆచూకీలను కనిపెట్టడంలో ఈయన ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు తోడ్పడ్డారు. అనంతరం వృద్ధురాలిని పడవలోకి ఎక్కించేందుకు ఆ మత్స్యకారురుడు తన వీపును మెట్టుగా మార్చాడు. వరద నీళ్లలో మోకాళ్లపై ఆయన ముందుకు వంగాడు. ఆయనపైకి ఎక్కి ఆమె పడవలోకి చేరుకారున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు మత్స్యకారుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.కేరళ వ్యాప్తంగా దాదాపు 600 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

నైరుతి రైల్వే అధికారులు నీరు, ఆహారం, బిస్కెట్లు, ఔషధాలను పంపేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థుల బృందం వీటిని తీసుకుని వెళుతోంది. మొత్తం 23 టన్నుల ఆహారం నేటి మధ్యాహ్నానికి కేరళ చేరుకుంటుంది. మరో రైలును కూడా పంపనున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లలో బియ్యం, రవ్వ, గోధుమ పిండి, నూనె, నీరు, ఉల్లిపాయలు, పప్పు, టీ పొడి, పాలు, పాలపొడి, చక్కెర, దుప్పట్లు ఉన్నాయని తెలిపారు.ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయం చేస్తూ అక్కడే వారికి తోడుగా ఉంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.