Breaking News:ఎలక్షన్ టైం లో కాంగ్రెస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మృతి..షాక్ లో రాహుల్ గాంధీ

386

ఇటీవ‌ల రాజకీయ నాయ‌కుల మృతి పలు పార్టీలను మాన‌సికంగా కుంగ‌దీస్తోంది అనే చెప్పాలి.. బీజేపీ నేత‌లు ఇటీవ‌ల కొంద‌రు మ‌ర‌ణించ‌డం వారు చేసిన సేవ‌లు త‌ల‌చుకుని పార్టీలు వారిని స్మ‌రించుకుంటున్నాయి.. తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ఎంపీ మృతి చెందారు.. దీంతో హ‌స్తిన పెద్ద‌లు అంద‌రూ షాక్ అయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు కన్నుమూశారు. వయానాడ్ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షానవాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధతపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా..బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. న్యాయవాదుల కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి నాయకునిగా జీవితం ప్రారంభించారు. తొలుత కేరళ విద్యార్థి సంఘంలో పనిచేసిన ఆయన యూత్ కాంగ్రెస్ లో చేరి ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టి,… కీలక పాత్ర పోషించారు.ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వయానాడ్‌ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఐ షానవాస్‌ కన్నుమూశారు అని తెలియ‌గానే కేర‌ళ‌కు కాంగ్రెస్ పెద్ద‌లు చేరుకున్నారు . కొన్ని రోజుల కిందట కాలేయ మార్పిడి చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన షానవాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు అని వారి కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు. ఆయ‌న కాంగ్రెస్ లో ప‌లు పెద్ద పెద్ద ప‌ద‌వులు అధిరోహించారు.ఆయనకు భార్య జుబ్బదాత్, కుమార్తె అమీనా, కుమారుడు హసీబ్ ఉన్నారు. ఆయన మృతదేహాన్ని ఈ రోజు మధ్యాహ్నంలోపు చెన్నై నుంచి కొచ్చికి తరలించనున్నారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరాయి విజయన్‌తో పాటు, కేరళ కాంగ్రెస్‌ నాయకులు సంతాపం తెలిపారు.