ఉగ్రవాదుల దాడిలో గతేడాది తన తండ్రి మరణించాడని తెలియక ఆ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

362

మ‌నం కంటి నిండా కునుక వేస్తున్నాం అంటే, అక్క‌డ ల‌క్ష‌లాది మంది సైన్యం కంటిమీద కునుకు లేకుండా పహారాకాస్తున్నారు అనేది తెలుసుకోవాలి.. వారు లేనిదే మ‌నం ఇంత అంద‌మైన జీవితాల‌ను గ‌డ‌ప‌లేము. అందుకే ఆర్మీ సోల్జ‌ర్స్ కు మ‌నం ఎంతో రుణ‌ప‌డి ఉంటాం. దేశ భ‌ద్ర‌త‌ను శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో, వారి కృషి అమోఘం. ఇక కొన్ని విప‌త్క‌ర స‌మ‌యాల్లో ఉగ్రవాదుల దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన అమ‌ర‌వీరులైన జ‌వాన్లు ఉన్నారు. దేశం కోసం వారిప్రాణాల‌ను తృణ‌ప్యాయంగా వ‌దిలేశారు. ఇలాంటి చాలా ఘ‌ట‌న‌లు క‌లిచివేసిన సంఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

ఇలాంటి ప్ర‌మాదంలో గత ఏడాది ఉగ్రవాదుల తూటాలకు ఏఎస్‌ఐ జవాను అబ్ధుల్లా రషీద్ అమరుడయ్యారు. అయితే అతని కుమార్తె జోహ్రా… ఈనాటికీ తండ్రి ఏదో ఒకరోజు తిరిగి వస్తాడని ఎదురు చూస్తోంది. ఈసారి తన తండ్రి ఇంటికివస్తే తిరిగి వెళ్లబోనీయనని రోదిస్తూ చెబుతోంది. టీమిండియా క్రికెటర్‌ గంభీర్‌ ఆమెకు అండగా నిలుస్తానని ప్రకటిస్తూ ఓ ఎమోషనల్‌ సందేశం ఉంచిన విషయం తెలిసిందే.2017, ఆగస్టు 28న జవాను అబ్ధుల్లా రషీద్… జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల తూటాలకు అమరుడయ్యారు.

ఆ సమయంలో జోహ్రా రోదిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజన్లు చలించిపోయారు.అమరుడైన జవాను పెద్ద కుమార్తె బిల్కిస్ మాట్లాడుతూ… జోహ్రా తరచూ నాన్న ఎక్కడికి వెళ్లారని అడుగుతుంటుందని తెలిపింది. దీంతో తాము ఆమెను ఊరడించేందుకు నాన్న త్వరలో వస్తారని చెబుతామని తెలిపింది. వారి మాటలను నమ్ముతున్న జో్హ్రా.. ఈసారి నాన్నవస్తే ఇక ఎక్కడికీ వెళ్లనివ్వనని చెబుతోంది. కాగా తండ్రి అంతిమ సంస్కారాల సందర్భంగా జోహ్రా రోదిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇలా దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు కాపాడ‌ట‌మే కాకుండా దేశ స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల తూటాల‌కు బలైపోయిన అనేక కుటుంబాలు ఇలాంటి గాథ‌ల‌తోనే కాలం వెల్ల‌డీస్తున్నాయి.