కరుణానిధి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ షాకింగ్ నిజాలు

486

డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తుంది.ఆయన అత్యక్రియలు మెరీనా బీచ్ లో చెయ్యాలని నిర్ణయించారు.అయితే కరుణానిధి పోస్ట్ మార్టం బయట పడింది.మరీ అందులో ఏముందో తెలుసుకుందామా.

ఐదుసార్లు తమిళనాడు సీఎంగా పని చేసిన కరుణానిధి 94 ఏళ్ల వయసులో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. డీఎంకే చీఫ్‌గా సుదీర్ఘ కాలంపాటు ఆయన సేవలు అందించారు.అయితే ఇప్పుడు కరుణానిధి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది.కావేరి హాస్పిటల్ డాక్టర్స్ ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బయటపెట్టారు.కరుణానిధికి కొన్ని రోగాలు ఉన్నాయని తెలిసింది.ఆయనకు శ్వాస కోశ సమస్య ఉంది.ఆ సమస్య తీరిపోడానికి ఆయనకు ‘ట్రాకియోస్టొమీ’ ఆపరేషన్ చేశారు.దాని వలన కొంతకాలం మంచిగా ఉన్నా కూడా ఆ సమస్య ఆయనకు మళ్ళి వచ్చినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వలన తెలిసింది.అలాగే ఆయన వయసు ఎక్కువగా ఉండడం వలన ఆయన పక్కటెముకలు చెడిపోయాయి.ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ ఐనట్టు కూడా రిపోర్ట్ లో వచ్చింది.అలాగే గుండె పని తీరు కూడా సరిగ్గా లేదని రిపోర్ట్ లో వచ్చింది.బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా తేడా ఉన్నట్టు బయటపడింది.

ముఖ్యంగా బిపి అస్సలు కంట్రోల్ లో లేనట్టు తెలిసింది.ఈయన చనిపోడానికి ముఖ్య కారణం ఇదే అని తెలిసింది.చనిపోయే ముందు రోజు అయితే బిపి చాలా తక్కువ అయ్యిందని కాపాడాలని డాక్టర్స్ చాలా ప్రయత్నిచారని తెలిసింది.కానీ బిపిని కంట్రోల్ చెయ్యడానికి డాక్టర్స్ చెయ్యని ప్రయత్నం లేదని కానీ వారి వలన కాలేదని తెలిసింది.ఇవేనండి కరుణానిధి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ విషయాలు.