ఇతను పాపులర్ కావాలని బాలకృష్ణ ఇంట్లోకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే షాక్..

266

మనం పాపులర్ కావాలంటే ఏం చేస్తాం చెప్పండి.హ ఏముంది ఎవరు చెయ్యని పనిని మనం చేస్తాం.లేకుంటే ఒక పనిని కొత్త రకంగా చేసి చూపిస్తాం.అప్పుడు ఆటోమేటిక్ గా మనం పాపులర్ అవుతాం కదా.అయితే ఒక దొంగ పాపులర్ అవ్వడానికి ఎలాంటి స్కెచ్ వేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు.మరి ఆ దొంగ ఎవరు అతను పాపులర్ అవ్వడానికి ఎలాంటి స్కెచ్ వేశాడో తెలుసుకుందామా.

కర్రి సతీష్‌ గత నెల ఎమ్మెల్యే కాలనీలో డాక్టర్‌ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో చోరీలకు పాల్పడి బెంగళూరుకు ఉడాయించాడు. సీసీ ఫుటేజ్‌లు, దొంగతనాల తీరును బట్టి చోరీలన్నీ కర్రి సతీష్‌ చేసినవిగానే ధృవీకరించిన బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వైజాగ్‌లోని అతడి నివాసంతో పాటు బంధుమిత్రుల ఇళ్లపై నిఘా వేసి ఇటీవల బెంగళూరుకు మకాం మార్చినట్లు గుర్తించారు. నిందితుడి ఆచూకీ తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు బెంగళూరుకు వెళ్లారు.ఈ నెల 9న బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్‌ డీజీ శ్రీనివాసులు, అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. ఈ నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇంట్లో ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్‌ పెట్రోలింగ్‌ పోలీసులు అతడిని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా ముసుగు ధరించిన దొంగ కనిపించాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు తప్పించుకొని పారిపోతున్న సతీష్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పోలీసు విచారణలో గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలో 12 దొంగ తనాలు చేసినట్లు నిర్ధారణ అయింది. గత నెలలోనే ఎమ్మెల్యే కాలనీలో నాలుగు దొంగతనాలు చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.తనకు జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నంద మూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు సతీష్‌ బెంగళూరు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేస్తే పాపులర్‌ అవుతానని చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. ఒకవేళ బెంగళూరు పోలీసులకు దొరికి ఉండకపోతే వచ్చే నెలలో సతీష్‌ మళ్లీ జూబ్లీహిల్స్‌పై కన్నేసేవాడని ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ ఇంట్లో చోరీకి యత్నించేవాడని పోలీసులు పేర్కొన్నారు.ఇప్పుడు ఈ దొంగ దొరికాడు కాబట్టి బాలకృష్ణ సేఫ్ అయ్యాడు లేకుంటే బాలయ్య ఇంట్లో పెద్ద దొంగతనమే జరిగేది