4 ఏళ్లలో 43,200 సార్లు దారుణంగా రేప్ చేయబడిన యువతి గురించి తెలిస్తే కన్నీళ్లే.!

435

ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురైతే వారు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు. ఒకవేళ ఇలాంటి విషయాలు గనుక ఆయా వ్యక్తుల యుక్త వయస్సులో గనుక జరిగితే అది వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అంతేకాకుండా, జీవితంలో ఎప్పుడూ వాళ్ళు భయపడుతూనే ఉండేలా చేస్తుంది. ఒక అమ్మాయి నాలుగు సంవత్సరాలలో 43200 సార్లు అత్యాచారానికి గురైంది అనే విషయం మీకు తెలుసా ? అసలు ఇలా జరిగి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ? కానీ ఇది పచ్చి నిజం. కార్ల జేసీన్తో జీవితంలో చోటు చేసుకున్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కార్ల జేసీన్తో ఒక మానవ అక్రమ రవాణా బాధితురాలు. ప్రస్తుతం ఈ మహిళ అత్యాచారానికి గురైన బాధితులను ఆదుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. అసలు ఆమె జీవితంలో ఏ ఏ విషయాలు చోటుచేసుకున్నాయి. ఎందుకు ఆమె అంత దుర్భర స్థితిని అనుభవించింది. ఇప్పుడు ఎందుకు ఇలా వేరే వారికి అండగా నిలుస్తోంది అంటే… ఈమె మెక్సికో దేశంలోని ఒక చిన్న పట్టణంలో నివసించేది. ఆమె తనకు పన్నెండు సంవత్సరాల ఇంటి నుండి వెల్లిపాయింది, కారణం ఆమె పేదరికం. ఆ సమయంలో ఈమెను చూసుకునే వాళ్ళు ఎవరు ఆమె కుటుంబంలో లేరు. అబద్దపు వాగ్దానాలు, ఖరీదైన బహుమతులు, మంచి మాటలు ఇవన్నీ చెప్పి ఆమెను అత్యంత భయంకరమైన మానవ రవాణా వలలోకి లాగారు. వీటి కోసం వెళ్లి అక్కడ ఆమె బందీ అయిపొయింది.అప్పటికి ఆమె చాలా చిన్న అమ్మాయి. అటువంటి సమయంలో ఆమె ఒక వేశ్య సరఫరాదారుడి వలలో చిక్కుకుంది. ఆ అమ్మాయిని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ వ్యక్తికి మూడు నెలల సమయం పట్టింది. మొదట ఆమెను ఒక యువరాణిలా చూసుకున్నారు.

కానీ ఆ తర్వాత ఆమెకు నరకం చూపించారు.ఆమెను ఎక్కడో ఒక మూల కూర్చోబెట్టేవారు మరియు అతడి లాభం కోసం వీధుల్లో కష్టపడాలని ఆమె పై ఒత్తిడి తెచ్చేవాడు.అలా నాలుగు సంవత్సరాల వ్యవధిలో 40 వేలకు పైగా వ్యక్తులతో పడుకుని వ్యభిచారం చేసింది..వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేయాల్సిందే. ఈ విషయమై ఆమె ఏమని చెప్పిందంటే ” ప్రతి రోజు నా పని ఉదయం పది గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగేది. కొంతమంది పురుషులు నన్ను చూసి విపరీతంగా నవ్వే వారు, అందుకు కారణం ఆ సమయంలో నేను విపరీతంగా ఏడుస్తూ ఉండే దానిని అని చెప్పింది.ఆమె ఇప్పుడు అత్యాచార భాదితుల కోసం చేస్తున్న ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుందాం.