ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన జమ్మూ కాశ్మీర్ చివరి రాజు కుమారుడు కరణ్ సింగ్

88

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం సవరించింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ అంశాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన లభించిన సంగతి తెలిసిందే. కొన్ని పార్టీలు కేంద్రప్రభుత్వానికి మద్ధతు తెలపగా మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్న రేంజ్ లో బీజేపీ పై మండిపడుతుంది. అయితే కేంద్ర నిర్ణయాన్ని ఆ పార్టీ కి చెందిన సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ చివరి రాజు హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ సమర్ధించారు..

raja hari singh son Karan Singh supports scrapping of article 370

జమ్మూకాశ్మీర్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పూర్తి గా ఖండించాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరణ్ సింగ్ గతంలో కేంద్ర మంత్రిగా గా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన ఆయన రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. దేశ వ్యతిరేకత నెపంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడం సరైనది కాదని,వెంటనే ఆ పార్టీ నాయకులను విడుదల చేయాలనీ కేంద్రాన్ని కోరారు. అలాగే పార్లమెంటు ఆమోదం పొందిన పునర్విభజన బిల్లులోని లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదనను సింగ్ ఆహ్వానించారు. ఆర్టికల్ 35 ఏ రద్దుకు మద్దతు ఇస్తూనే లింగ వివక్షను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. జమ్ము, కశ్మీర్ మధ్య రాజకీయ అధికారాలను పునర్విభజన బిల్లు సరైన రీతిలో విభజిస్తుందన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

జమ్ముకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఖండించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ప్రభుత్వ నిర్ణయానికి ఆయన పూర్తిగా మద్దతు ఇవ్వలేదు, అలాగనీ వ్యతిరేకించనూ లేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించే తాను ప్రధానంగా ఆలోచిస్తానని సింగ్ తెలిపారు. కేంద్రం పార్లమెంట్ లో ఈ నిర్ణయం తీసుకొనే ముందు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం అక్కడ ప్రధాన పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో భారీగా బలగాలను దింపి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. కొన్నిచోట్ల 144 సెక్షన్ ను తీసేశారు. ప్రజలు బయటకు వచ్చి తిరుగుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో నార్మల్ గా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాశ్మీర్ రాజు కుమారుడు కరణ్ సింగ్చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.