అభినందన్ ని పంపమని పాక్ ప్రధానికి నేనే చెప్పా : K A పాల్

444

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చెర నుండి విముక్తి పొంది భారత్ చేరుకున్నాడు, యావత్ దేశం మొత్తం అతనికి ఘన స్వాగతం పలికింది. శాంతి స్థాపనకు సానుకూలంగా పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరు ప్రశంసిస్తున్న క్రమంలో అభినందన్ ను విడుదల చేయమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తానే చెప్పానని గ్లోబల్ పీస్ మేకర్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటున్నాడు.

Image result for kapaul

మీడియాతో మాట్లాడిన పాల్ అభినందన్ ను త్వరగా విడుదల చేసినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కృతఙ్ఞతలు తెలిపారు, ఇమ్రాన్ ఖాన్, ఆయన సలహాదారుడు అమీర్ లతో మాట్లాడి శాంతి స్థాపనకు సంకేతంగా అభినందన్ ను విడుదల చేయాలని తాను కోరినట్లు చెప్పుకొచ్చారు.

బీజేపీ ప్రభుత్వం సైన్యాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని దేశ భద్రతను పణంగా పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు యుద్ధం ప్రకటించనున్నారని గతంలోనే తాను చెప్పానని అన్నారు పాల్.

Related image

స్వప్రయోజనాల కోసం యుద్ధం ప్రకటిస్తే అది దేశానికి ప్రమాదం అని అన్నారు. రెండు నెలల తర్వాత రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయమని, కచ్చితంగా సెక్యులర్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేసారు కేఏ పాల్