జస్టిస్ ఫర్ ప్రణయ్: అమృత మరో సంచలన నిర్ణయం

464

పరువు హత్యలు తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. ప్రతీ హత్యా ఓ సంచలనమే. పరువు, ప్రతిష్ట అన్న మాయలో పడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. అంతేకాదు… పేగుతెంచుకుపుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు. అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి అమృత తక్కువ కులానికి చెందిన అబ్బాయి ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అమ్మాయి తండ్రి మారుతీరావు ప్రణయ్ ను చంపించిన సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ప్రణయ్ కు న్యాయం చేసేది ఎవరు.కోర్ట్ మాత్రమే న్యాయం చెయ్యగలదు.అయితే నేరస్థులకు శిక్ష పడాలంటే మనం కూడా ఎంతో కొంత చెయ్యాలి.అందుకే అమృత మన అందరి హెల్ప్ అడుగుతుంది.జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా మన అందరిని కోరుతుంది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

సంచలనం రేపిన పరువు హత్య కేసులో మృతుడు ప్రణయ్ భార్య అమృత న్యాయం కోసం పోరాటాన్ని ప్రారంభించారు. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని.. ముఖ్యంగా ప్రణయ్‌ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేస్తానని ఆమె అన్నారు. తాను మరో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని, పుట్టింటికి కూడా వెళ్లేది లేదని అమృత ఇప్పటికే చెప్పింది.ప్రణయ్ హత్య విషయంలో సామాజిక న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టారు భార్య అమృత. ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరిట ఫేస్‌బుక్‌ పేజీ క్రియేట్‌ చేశారు. ఫేస్ బుక్ పేజీ ప్రారంభించిన తొలి ఐదు గంటల్లోనే పదివేల మంది పేజీని లైక్ చేశారు. ప్రణయ్ విషయంలో న్యాయం జరగాలంటూ కామెంట్ పోస్ట్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కుల పిచ్చి పట్టిన మారుతీరావు పరువు కోసం ప్రణయ్‌ను దారుణంగా చంపేశాడని అతన్ని హత్య కుట్రలో పాల్గొన్న అందరినీ కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో ఇప్పటికే జనం డిమాండ్‌ చేస్తున్నారు. ఇపుడు జస్టిస్ ఫర్ ప్రణయ్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అయిపోయింది. ఈ డిమాండ్ కు జనం మద్దతు పెరుగుతోంది.ఆమెకు తగిన న్యాయం జరిగేంతవరకు మేము కూడా పోరాడతామని పలువులు ఆమెకు మద్దత్తుగా నిలుస్తున్నారు.సోషల్ మీడియాలో ఆమెకు భారీగా సపోర్ట్ వస్తుంది.మరి ఆమె అనుకున్న న్యాయం ఆమెకు దక్కుతుందో లేదో చూడాలి.దక్కాలని మనమందరం కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పరువు హత్య గురించి అలాగే ప్రణయ్ కు జస్టిస్ జరగాలని అతని భార్య అమృత చేస్తున్న సోషల్ మీడియా పోరాటం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.