తెలంగాణ‌లో ప్ర‌చారానికి ఎన్టీఆర్ వెళ్తే ప్రాణ గండం..ఇంకా పండితులు ఏం చెప్పారో తెలిస్తే షాక్

308

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయి అంటే అక్క‌డ ఎటువంటి ప్ర‌చారం జ‌రుగుతుందో తెలిసిందే….ఎన్నికలు వస్తున్నాయంటే సినీ గ్లామర్ తో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ పార్టీ నేతలు… ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త ముందుంటారు. గతంలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ని ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పవన్ ని కూడా త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాడుకున్నారు అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇలా సినిమా వాళ్ళతో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకునే బాబు మరోసారి ఎన్టీఆర్ ని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వార్త‌లు తెలంగాణ‌లో వినిపిస్తున్నాయి.

కూకట్ పల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని గెలుపు కోసం ప్రచారం చేయాల్సిందిగా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లని బాబు కోరారట. కానీ అన్నదమ్ములిద్దరూ కూడా తమ సోదరికి మద్దతు ప్రకటిస్తాం కానీ ప్రచారం ఐతే చేయమని ఖరాకండిగా చెప్పేసారట. దీనికి కారణం ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేయద్దు అని బలంగా కోరుకోవడం ఒకటి ఐతే, మరొక కారణం టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎన్‌టి‌ఆర్ కున్న అభిమానం అని అంటున్నారు. తన అక్క సుహాసిని కోసం ప్రచారం చేస్తే, టీడీపీ పార్టీకి చెందిన మిగతా అభ్యర్ధులు కూడా తమ తరపున ప్రచారం చేయమని ఒత్తిడి చేస్తారు. అలా చేస్తే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయాల్సివస్తుంది. అలా చేయడం ఎన్టీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదట.

ఎందుకంటే ఆయన తండ్రి హరికృష్ణ మరణించినప్పుడు కేసీఆర్ కుటుంబం తమకు అండగా నిలిచింది. అందుకే కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన వెనక్కి తగ్గారని సమాచారం. ఐతే బాబు మాత్రం రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్ లు ఉండకూడదని అంటున్నారట. కానీ ఎన్టీఆర్ మాత్రం “తెలంగాణలో ఉంటూ, తెలంగాణ సొమ్ము తింటూ, తెలంగాణ నేతల సాయం పొంది, తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా అసలు? అలా చేస్తే నేను మనిషినవుతానా?” అని తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మైండ్ లో ఒక్కసారి ఫిక్స్ అయ్యాను, ప్రచారానికి రాకూడదని. ఇక అంతే అదే ఫైనల్. పదే పదే అడిగి విసిగించద్దు అని ఎన్‌టి‌ఆర్ హింట్ ఇచ్చారట.దీంతో బాబు బాలయ్య మంత్రం వేయాలని చూస్తున్నారట. ఇదిలా ఉంటే తమ కుటుంబానికి ప్రాణ గండం ఉన్న కారణంగా కుటుంబసభ్యులు, అభిమానులు ఎలాంటి ప్రచారానికి వెళ్లొద్దని అంటున్నారట. గతంలో కూడా ఇలానే టీడీపీ ప్రచారం కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందుకే ఈ ప్రచారాలు, రాజకీయాలు ప్రస్తుతానికి అచ్చి రాలేదని, అందుకే ఎన్టీఆర్ ను ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని అభిమానులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. పైగా నందమూరి కుటుంబానికి వాహన గండం ఉంది.