ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకోవడంతో ఫ్యాన్స్ ఎలా ఫీలయ్యారో తెలుసా?

266

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 11న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరాకు డబుల్‌ పండుగను తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్దం అయ్యారు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్‌ కన్నీరు పెట్టుకోవడంతో అభిమానులు అంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

అరవింద సామెత ప్రీ రీలిజ్ ఫంక్షన్ నిన్న జరిగింది.ఆ వేడుకలో తండ్రి హరికృష్ణ మరణం గురించి మాట్లాడిన ఎన్టీఆర్‌ ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేక పోయారు. దాదాపు పావుగంట సమయం మాట్లాడిన ఎన్టీఆర్‌ కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నాడు. తాను కన్నీరు పెట్టుకోవడంతో పాటు ప్రేక్షకులను మరియు అభిమానుల కన్నీళ్లకు కారణం అయ్యాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను అలా చూడని ప్రేక్షకులు మరియు అభిమానులు ఎమోషన్‌ అయ్యారు. ఎన్టీఆర్‌తో పాటు ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీవీలు చూస్తున్న ప్రేక్షకులతో పాటు, ఫంక్షన్‌ వద్దకు వెళ్లిన అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుని ఎన్టీఆర్‌ బాధను ఫీల్‌ అయ్యారు.

ఎన్టీఆర్‌ ఈ చిత్రంలోని ఒక సీన్‌ గురించి మాట్లాడుతున్న సమయంలో కన్నీరు ఆపుకోలేక పోయారు. నోట్లోంచి మాట కూడా రానంతగా కుమిలి కుమిలి ఏడ్చారు. అది చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా కన్నీరు పెట్టుకున్నారు. సినిమాల్లో తప్ప ఎప్పుడు బయట ఎన్టీఆర్‌ ఏడుస్తుండగా చూడలేదు. అసలు ఎన్టీఆర్‌కు ఆ అవసరం రాలేదు. తాజాగా అరవింద సమేత ప్రీ రిలీజ్‌ వేడుకలో ఇలా ఏడవడంతో అభిమానులు కూడా ఆయనతో పాటు కన్నీరు పెట్టుకున్నారు.ఇలా తన స్పీచ్ తో అభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించాడు.