రియల్ హీరో దుర్మరణం…మొన్న కేరళ వరదల్లో అనేకమందిని కాపాడిన వాడు ఇప్పుడు ఎలా చనిపోయాడు తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

322

గత రెండు నెలల క్రితం కేరళలో వరదలు సృష్టించిన జలప్రళయం తెలిసిందే..ఈ ప్రకృతి విపత్తులో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు 30 వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. కనివిని ఎరుగని రీతిలో కేరళలో వరదలు వచ్చాయి. ఇంకా అక్కడ సాధారణ పరిస్దితులు అయితే రాలేదు, ఇక ఈ సమయంలో చాలా మంది కేరళలో వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఉద్యోగులు కేరళ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇక్కడకు వచ్చి తమ ప్రాంతానికి వచ్చిన కష్టానికి చలించిపోయారు. ఇక కేరళలో ఇలా పలువురి ప్రాణాలు కాపాడి సాయం చేసిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

కేరళ వరదల్లో అనేకమందిని కాపాడి రియల్ హీరోగా ప్రశంసలందుకున్న జినీష్ జెరోన్ ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. సరిగ్గా నెల రోజుల క్రితం అతడికి అపూర్వ స్వాగతం పలికిన స్వగ్రామం పొంతూరా… ఇప్పుడు కన్నీటి సంద్రమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఓ లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన జెరోన్ శనివారం ఉదయం మృతిచెందాడు. స్నేహితుడితో కలిసి తన బైక్ మీద తమిళనాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ స్కిడ్ అవ్వడంతో జినీష్ రోడ్డుపై పడ్డాడనీ.. అప్పుడే అటుగా వచ్చిన లారీ అతడి మీదినుంచి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పొంతూరా గ్రామానికి చెందిన మత్స్యకారుడైన జినీష్.. ప్రభుత్వాధికారుల కంటే ముందే వరద బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన ‘కోస్టల్ వారియర్స్’లో బృందంలో సభ్యుడు. వరదల కారణంగా ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, కాపాడడంలో జినీష్ మంచి సాధనంగా ఉపయోగపడ్డాడు. ఆగస్టు 16న జినీష్ సహా అతడి ఆరుగురు మిత్రులు చెంగన్నూర్లో ఓ పడవ అద్దెకు తీసుకుని స్వచ్ఛందంగా సహాయక చర్యలు చేపట్టారు. కాగా జినీష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఊరంతా బ్యానర్లు, పోస్టర్లతో జినీష్కు నివాళులు అర్పించారు. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సహా పలువురు ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చారు.ఇలాంటి మానవతావాది అందరిని సమాజంలో తన వారు అని అనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు.. కాని అందులో ఆయన ఒకరు అని అంటున్నారు.. ముఖ్యంగా ఇలాంటి మానవతావాది, మంచి వ్యక్తి చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని అంటున్నారు. ఇలాంటి ఓ మంచి వ్యక్తి ఎందరి ప్రాణాలో కాపాడాడు కాని ఓ లారీ అతని ప్రాణాలు తీసింది అని, దేవుడు మంచి వారిని తీసుకువెళ్లిపోతున్నాడు అని అక్కడవారు కన్నీటి పర్యంతమయ్యారు..