షాకింగ్ న్యూస్: జైషే మహ్మద్ చీఫ్ అజార్ మసూద్ మృతి తేల్చిన అమెరికా

291

జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ చనిపోయినట్లు తెలుస్తోంది. మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని రెండ్రోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బాలాకోట్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన జరిపిన సర్జికల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడని కొందరు, అనారోగ్యం కారణంగా శనివారం చనిపోయాడని మరికొందరు చెబుతున్నారు. మసూద్ చనిపోయాడని సోషల్‌మీడియా కోడై కూస్తోంది.

Image result for అజార్ మసూద్

మసూద్ మరణించాడంటూ వస్తున్న వార్తలపై పాక్ ప్రభుత్వం స్పందించడం లేదు. మసూద్ పాక్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని అమెరికాకు చెందిన ఓ వార్త పత్రిక కథనం ప్రచురించింది. పాక్ ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుందని కూడా తెలిపింది. అయితే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న వాదనను పక్కదోవ పట్టించేందుకు పాక్ ఇలాంటి ప్రచారం చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ అధినేత బతికే ఉన్నాడని జైషే మహ్మద్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మసూద్ చనిపోయాడని తెలిస్తే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఢీలా పడిపోయే అవకాశం ఉన్నందున అతడి మరణవార్తను బయటకు రానివ్వడం లేదన్న వాదనా ఉంది. మసూద్ మరణ వార్తలపై వస్తున్న కథనాలపై తనకేమీ తెలీని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

పాకిస్తాన్ మంత్రి కూడా మసూద్ అజార్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వుందని, అతను ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో తాజాగా మసూద్ అజార్ మరణించిన నట్లు వార్తలు వినిపించ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ద్రువీకరించక పోవడం విశేషం. మరి ఈ వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించే వరకు చూడాల్సిందే. ఇక అమెరికా కూడా ఈ విష‌యం పై పాక్ ని క‌చ్చితంగా వివ‌రాలు అడ‌గ‌నుంది. ఇలాంటి క‌రుడు గ‌ట్టిన ఉగ్ర‌వాది చ‌నిపోయాడు అని తెలిస్తే ప్ర‌పంచం అంతా సంతోషిస్తుంది అంటున్నారు ప్రాణాలు కోల్పోయిన జ‌వాన్ల కుటుంబాలు.