జ‌లీల్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం శోక‌సంద్రంలో కుటుంబసభ్యులు

462

విజ‌య‌వాడ‌లో పశ్చిమ ఎమ్మెల్యే, ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ జలీల్‌ఖాన్ ఇంట విషాదం అల‌ముకుంది.. ఆయ‌న కుటుంబంలో విషాదంతో ఆయ‌న ఇంటికి పెద్ద ఎత్తున పార్టీ నేత‌లు అభిమానులు చేరుకుంటున్నారు…. జ‌లీల్ ఖాన్ సోదరుడు షబ్బీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కుమారుడు మోసిన్‌ఖాన్ గుండె పోటుతో మరణించాడు. మోసిన్‌ఖాన్‌ ఆటోనగర్‌లో ఐరన్‌ వ్యాపారం చేస్తున్నాడు… ఉదయం వ్యాపారం నిమిత్తం ఆటోనగర్‌ వెళ్లాడు. అయితే గుండెలో నొప్పిగా ఉందని ఒక్కడే సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లి, తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేశాడు. గుండెపోటు అధికంగా రావడంతో అక్క‌డే చ‌నిపోయాడు.. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, కుటుంబ సభ్యులు ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత‌ని వ‌య‌సు 27 సంవ‌త్స‌రాలు అని తెలుస్తోంది.

ఇక మోసిన్‌ఖాన్‌ మృతదేహాన్ని పాతబస్తీ తారాపేటలోని ఎమ్మెల్యే నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), తెలుగు యువత రాష్ట్ర నాయకుడు దేవినేని అవినాష్‌, వైసీపీ నాయకులు షేక్‌ ఆసిఫ్‌, ఎం.ఎస్‌.బేగ్‌, పోతిన వెంకట వరప్రసాద్‌, టీడీపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీల నాయకులు వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుడుకి భార్య, కుమార్తె ఉన్నారు. ఆయ‌న‌కు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని స‌డ‌న్ హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో మ‌రణించాడు అని అంటున్నారు

పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ సోదరుడి కుమారుడు మోసిన్‌ ఖాన్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. గుండె పోటుతో మోసిన్‌ఖాన్‌ మృతి చెందడంపై ముఖ్యమంత్రి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జలీల్‌ఖాన్‌ సోదరుడు షబ్బీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఆయ‌న ఇంటికి పెద్ద ఎత్తున పార్టీ కార్య‌క‌ర్త‌లు ముస్లిం సోద‌రులు వ‌స్తున్నారు.