కోతులను చంపడంతో జగిత్యాల బస్సు ప్రమాదం జరిగిందా …?

457

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కు ఆగ్ర‌హం వచ్చిందా..? అంటే ఇక్క‌డి ప్ర‌జ‌లు అవున‌నే చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా అంజన్న పుణ్యక్షేత్రం కొండగట్టు ఘాట్‌ రోడ్డులో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో, ఆర్టీసీ చరిత్రలో ఇంత మందిని బలిగొన్న బస్సు ప్రమాదం ఇదే తొలిసారి. కేవలం 25 అడుగుల లోతున్న లోయ‌లోకి బస్సు ప‌డిపోయి 60 మంది చనిపోవడంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Image result for bus accident

అంజన్నకు ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే బస్సు ప్రమాదం సంభ‌వించింద‌ని జగిత్యాల ప్రాంతవాసులు చ‌ర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని గోవిందారం దారి పక్కన 60 కోతుల కళేబరాలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్‌ షాక్‌ పెట్టి కోతులను హతమార్చినట్లుగా ఉందని కొడిమ్యాల రేంజర్‌ బుర్ర లత అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి

అది అంజన్నస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కోతుల కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందడమేమిటని పలువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. కోతులను చంపడంతోనే అంజన్నకు ఆగ్రహం వచ్చిందని శనివారంపేట, డబ్బుతిమ్మయ్యపల్లి, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌ తదిత‌ర గ్రామాల ప్రజలు చ‌ర్చించుకుంటున్నారు.