జ‌గ‌న్ కుటుంబంలో తీవ్ర విషాదం..షాక్ లో అభిమానులు

622

వైయ‌స్సార్ కుటుంబంలో మ‌రో విషాదం అల‌ముకుంది.. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం విశాఖ జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కుటుంబంలో ఓ విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ విష‌యాన్ని జ‌గ‌ప్ కు కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు. ఈ విషాదంతో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కుటుంబం అంతా పులివెందుల చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాబాయి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమ రెడ్డి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఆయన మృతిపట్ల జగన్ సంతాపం తెలిపారు. పురుషోత్తమరెడ్డి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే బెంగ‌ళూరు నుంచి జ‌గ‌న్ అన్న‌ద‌మ్ములు చెల్లెల్లు అక్క‌డ‌కు చేరుకున్నారు.. అలాగే జ‌గ‌న్ కుటుంబసభ్యులు పులివెందులకు వెళ్లారు. ఆయనకు వైయస్ విజయమ్మ, షర్మిల, భారతి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి లు నివాళులు అర్పించారు.

వైయ‌స్ కుటుంబంలో ఇప్పుడు పెద్ద‌గా ఉన్న ఆయ‌న, మ‌ర‌ణం విషాద‌క‌రం అనే చెప్పాలి.. రాజ‌కీయాల్లో ఆయ‌న కూడా పులివెందుల‌లో ఎంతో పేరు సంపాదించారు.. ఆయ‌న మ‌ర‌ణంతో అక్క‌డ వైయ‌స్ ఫ్యామిలీ అభిమానులు ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక వైయ‌స్ ఇంటికి పెద్ద‌గా ఉన్నారు, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నా, ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు కోలుకుంటున్నారు.. కాని నిన్న ఆయ‌న‌కు మ‌రింత ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు..గ‌తంలో ఆయ‌న పులివెందుల‌కు ఎమ్మెల్యేగా చేశారు.. అలాగే ఆయ‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ కేడ‌ర్ ఉండేది. ఎడుగూరి ఫ్యామిలీలో ఆయ‌న‌కు కూడా రాజ‌కీయంగా ఎంతో పేరు ఉండేది. ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు ఆయ‌న మృతిప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేసి నివాళులు అర్పించారు.