జబర్దస్ కమెడియన్ హరి కన్నీటి గాధ..అమ్మని బ్రతికించడం కోసమే స్మగ్లింగ్ చేశా.?

631

చాలా క్లిష్ట పరిస్థితుల్లో తాను ఎర్రచందనం స్మగ్లింగ్ చేయవలసి వచ్చిందని బుల్లితెర హాస్య నటుడు హరి తెలిపాడు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన తరువాత హరి మీడియాతో తన కన్నీటి గాదని వివరించాడు. తాను గతంలో ఏం చేసేవాడిని, స్మగ్లింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, తనపై జరిగిన కుట్రలు వంటి విషయాలు హరి మీడియాకు వివరించాడు.

తాను మొదట ప్రభుత్వ ఉద్యోగం చేసానని హరి చెబుతున్నాడు. జల్సాలకు అలవాటు పడడం వలన ఎక్కువగా అప్పులు చేశా. దీనితో ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని హరి తెలిపాడు.నాలుగేళ్ళ క్రితం అమ్మకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. అప్పులు ఒకవైపు, తల్లి అనారోగ్యం మరోవైపు తీవ్ర మనోవేదనకు గురిచేశాయని హరి తెలిపాడు. ఆసుపత్రికి తీసుకునివెళ్ళి కనీసం చికిత్స కూడా చేయించలేని పరిస్థితికి దిగజారిపోయా.

ఇక తప్పని పరిస్థితుల్లో అమ్మకు చికిత్స చేయించాలని స్మగ్లింగ్ చేశానని హరి అంగీకరించాడు. తాను ఈ విషయాన్నే పోలీసులకు వివరించానని తెలిపాడు. ఆ ఒక్కసారి మాత్రం తాను స్మగ్లింగ్ చేసానని ఆ తరువాత దాని జోలికి కూడా పోలేదని తెలిపాడు.తనతో కలసి స్మగ్లింగ్ చేసిన శ్రీనివాసులు రెడ్డి పోలీసులుకు తన పేరు చెప్పడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నాపై కేసు నమోదు చేశారు. నేను స్మగ్లింగ్ చేశాను కాబట్టి నిజాయితీగా శిక్ష అనుభవిస్తాను అని హరి తెలిపాడు.

తాను స్మగ్లింగ్ మానేసిన తరువాత కూడా శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్సైతో కలసి స్మగ్లిండ్ కొనసాగించాడు. ఆ వ్యవహారం బయట పడడంతో ఇప్పుడు తనపై అబద్దాలు చెప్పాడని అందువలనే ఇతర కేసులు కూడా తనపై నమోదయ్యానని హరి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఎర్రచందనరం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన అక్రమ డబ్బుతో హరి ఓ చిత్రానికి ఫైనాన్స్ చేశాడని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జబర్దస్త్ కామెడీ షోతో హరి బుల్లి తెరపై కమెడియన్ గా పేరు సంపాదించాడు.