అది కుక్క మాంసం కాదట రిపోర్ట్ లో ఏమని వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు బిర్యానిలు తినడం మానేస్తారు

636

ఇటీవ‌ల ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు ప‌లు రెస్టారెంట్ల‌లో కంప్లైంట్స్ రావ‌డంతో అనేక చోట్ల సోదాలు దాడులు నిర్వ‌హించి. అక్క‌డ వారు వండుతున్న వంట‌ల‌ను చూస్తున్నారు.. చికెన్ మ‌ట‌న్ నిల్వ ఉంచిన వాటిని చెక్ చేసి ల్యాబ్ కు పంపుతున్నారు ఇక కుల్లిపోయిన ఆహార‌ప‌దార్దాలు వండుతున్నారు అని తెలిస్తే వారిపై క‌ఠిన చ ర్య‌లు తీసుకోవ‌డ‌మే కాదు, వారి రెస్టారెంట్ల‌ను మూయించే ఆలోచ‌న కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు చికెన్ మ‌ట‌న్ త‌ర‌హాలో కుక్క మాంసం కూడా రెస్టారెంట్ల‌లో బిర్యానికి వండుతున్నారు అనేది పెద్ద విమ‌ర్శ, ప‌లు చోట్ల మార్కెట్లో త‌క్కువ‌కు దొరుకుతున్న కుక్క మాంసం ఇలా బిర్యానికి వాడుతున్నారు, మ‌రి ఈ విష‌యం గురించి కొంచెం డీప్ గా తెలుసుకుందాం.

Image result for కుక్క మాంసం

రోడ్ మీద ఏదైనా కుక్క కనిపిస్తే ఏం చేస్తాం ..? ఛీ ఛీ అంటూ చీదరించుకుంటూ వెళ్ళిపోతాం. అయితే అటువంటి కుక్క మాంసం గురించి చెప్తే వాంతి వచ్చినంత పనవుతుంది. కానీ తమిళనాడులో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. ఓ పార్శిల్‌ లో దాదాపు 2000 కిలోల కుక్కమాంసం బయటపడింది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు. అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు. దాదాపు 2000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రాజస్తాన్‌ రాష్ట్రం జోథ్‌పూర్‌ నుంచి ఈ మాంసాన్ని ఐస్‌ పెట్టెల్లో ఉంచి తీసుకు రాగా, ఆ పెట్టెలపై ఉన్న చిరునామా ఆధారంగా నగర పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన మాంసాహార ప్రియులను హడలెత్తించింది. అంతే కాకుండా బిరియాని విక్రయాలు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై పశుసంవర్థక శాఖ వైద్య అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్నది కుక్క మాంసం కాదని, మేక మాంసమేనని తమ పరిశోధనల్లో తేలిందన్నారు. ఈ మాంసం గడువు ముగిసిన అనంతరం రాష్ట్రానికి చేరడం వల్లే ఈ అనుమానం వచ్చిందని వారు తెలిపారు. చూశారుగా కొన్ని చోట్ల మాత్రం ఇలా కుక్క‌మాంసం వండుతున్నారు అనేది ప‌క్కా తేడా ఏమిటో గుర్తించండి క‌చ్చితంగా తేడా క‌నిపిస్తే పోలీసుల‌కు ఫుడ్ సేఫ్ట్ అధికారుల‌కు కంప్లైంట్ ఇవ్వండి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.