షాకింగ్: పకోడాలు అమ్మే వ్యక్తి ఇంట్లో ఐటీ దాడులు.. ఎంత దొరికిందో తెలిస్తే షాక్

225

ఐటీ దాడులు…ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం.దేశంలో ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఎక్కడైనా నాయకులూ బ్లాక్ మనీతో రాజకీయాలు చేస్తున్నారా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు అధికారులు.అయితే మనం ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఇళ్లల్లో సినీ తారల ఇళ్లలో లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇళ్లలో ఐటీ దాడులు జరగడం చూసాం.కానీ ఇప్పుడు పకోడీ అమ్ముకుని బతికే వ్యక్తి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి.అదేమిటి అతని ఇంట్లో ఏం దొరుకుతుంది అని అనుకుంటున్నారా.ఎవరిని తక్కువ అంచనా వెయ్యకండి.అతని ఇంట్లో మొత్తం ఎంత దొరికిందో తెలిస్తే షాక్ అవుతారు.మరి ఆ వివరాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pakodi in village people

పంజాబ్‌లోని లుథియానాలో నివసించే పన్నా సింగ్ అనే వ్యక్తికి రెండు పకోడా దుకాణాలు, స్నాక్స్ షాప్స్ ఉన్నాయి.అయితే ఇప్పుడు ఈయన దేశ వార్తల్లో నిలిచాడు.అయితే ఈ పకోడా లేదా స్నాక్స్ దుకాణం కారణంగా ఆయన వార్తల్లోకి ఎక్కలేదు.పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి ఇళ్లకు ఆదాయ పన్ను శాఖ అధికారులు రావడం మనం చూస్తాం. కానీ, పన్నా సింగ్ ఇళ్లు, దుకాణాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆయన ఎంత సంపాదిస్తున్నాడనే విషయంపై ఓ అంచనాకు రావడానికి పలు విషయాలను పరిశీలించారు.అతనికి తమ ప్రాంతంలోని గిల్ రోడ్‌లో ఒక పకోడీల దుకాణం, మోడల్ టౌన్‌లో మరో దుకాణం ఉన్నాయి. అంతేగాక, ఆయన పలు రాష్ట్రాల్లోనూ పకోడీల దుకాణాలు నడుపుతున్నాడు.

Image result for pakodi in village people

ఆయనకు సంబంధించిన ఐటీ రికార్డులను అధికారులు పరిశీలించారు. ఆయన దాఖలు చేస్తున్న ఐటీ రిటర్నులను, ఎంత పన్ను కట్టాడన్న వివరాలతో పాటు పలు వివరాలను అధికారులు ఆరా తీశారు.పకోడీలు అమ్మే వ్యక్తి ఇంట్లో నల్లధనం ఏమైనా దొరికిందా? అనే విషయంపై అధికారులను మీడియా ప్రశ్నిస్తే, వారు ఈ విషయాన్ని వెల్లడించలేదు. కానీ దుకాణ యజమానిని ఇదే విషయమై అడగ్గా. ఐటీ రిటర్నుల్లో చూపకుండా దాచుకున్న రూ.60 లక్షలను స్వయంగా వారికి ఇచ్చానని చెప్పాడు. గిల్‌ రోడ్‌ ప్రాంతంలో 1952లో పన్నా సింగ్‌ అనే వ్యక్తి చిన్న పకోడీ దుకాణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ దుకాణ శాఖలు పంజాబ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ దుకాణాలను ఇప్పుడు పన్నా సింగ్ వారసులు నడుపుతున్నారు.రోడ్డు పక్కన పకోడాలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే.. అని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో అన్నారు. ఈ సమయంలో విమర్శలు, అంతకుమించి సమర్థనలు వచ్చాయి. పకోడాలను, నిరుద్యోగాన్ని ఒకే గాటిన కట్టారని నరేంద్ర మోడీపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించాలని మోడీ మద్దతుదారులు విపక్షాలకు చురకలు అంటించారు.ఈ పకోడీ వ్యక్తి సంపాదించింది చూస్తుంటే ఉద్యోగాల కంటే ఇలా పకోడీ అమ్ముకోవడమే ఉత్తమం అనిపిస్తుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఐటీ దాడి జరిగిన ఈ పకోడీ వ్యాపారి గురించి అలాగే అతను పకోడీ ద్వారా అంతలా సంపాదించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.