మీ అమ్మాయి అమీర్ పేటలో ఉందా? అయితే జాగ్రత్త!

255

హైదరాబాద్ లో ఎందరో నివసిస్తున్నారు. ఇక్కడ ఎవరి దారి వారిదే. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే ఇక్కడ అక్రమ కార్యకాలపాలు కూడా ఎక్కువే. ముఖ్యాంగా అమ్మాయిలని ప్రేమ పేరుతో వంచించి ఆ తరువాత వారిని పెళ్లి చేసుకొని, వ్యభిచార గృహాలకి అమ్మేసే ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కన్ను అమీర్ పేట ఉమెన్స్ హాస్టల్స్ మీద పడిందా అంటే అవును అనే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మరి ఏమైందో చూద్దామా.

Related image

బీటెక్ పూర్తి చేసి అమీర్ పేట హాస్టల్ లో ఉండి, ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటున్న ఓ అమ్మాయిని ప్రేమ కడపకి చెందిన నాగరాజ్ అనే యువకుడు ప్రేమిస్తున్న అని చెప్పి నమ్మించి, బలవంతంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాత విజయవాడ తీసుకుపోయి అక్కడ అతని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా నాగరాజు, అతని తల్లి అమ్మాయిని కువైట్ పంపించాలని చూస్తున్నట్లు ఆమె గుర్తించింది. తన ఇష్టంతో ప్రమేయం లేకుండా వారికి వారుగా నన్ను కువైట్ పంపించే ఆలోచన చేస్తున్నట్లు ఆమెకి అర్ధమైంది. అదే సమయంలో గర్భంతో ఉన్న ఆమెని గర్భం తీయించుకోవాలని బలవంతం చేసారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఏవో మందులు ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేసారు. తరువాత పక్కా పథకం ప్రకారం ఆమెని కువైట్ పంపించాలని అనుకుంటున్నా టైం లో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని తమ సొంత ఊరైన గుంటూరు చేరుకొని వారి మీద గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి

వారి వెనుక ఏమైనా అమ్మాయిలని సరఫరా చేసే గ్యాంగ్ లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. సుమారు ఈ స్థాయిలో కాకుండా అమీర్ పేట హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలకి సుమారు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ప్రేమ పేరుతో నమ్మించి మోసచేయడం, వాడుకొని వదిలేయడం వంటి ఘటనలు ఈ మధ్య భాగా వెలుగుచూస్తున్నాయి. అయితే అమీర్ పేటలోని ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అమీర్ పేటలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ అమ్మాయిలకు ఎర వేస్తే ఎవరో ఒకరు బుట్టలో పడతారు అనే ఆలోచనతో ఈ గ్యాంగ్స్ అమీర్ పెట్ ను టార్గెట్ చేసుకున్నారు. వారి బుద్ధి తెలియక అమ్మాయిలు కూడా వారి వలలో పడుతున్నారు. కొందరు అయితే విద్యార్థులలాగా నటించి అమ్మాయిలకు వలవేస్తున్నారు. అందుకే మీ అమ్మాయిని అమీర్ పేటకి పంపించాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి. లేకుంటే మీ అమ్మాయికి కూడా ఎవరో ఒకరు ఎర వేస్తారు. కాబట్టి జాగ్రత్త. మరి ఈ అఘటన గురించి అలాగే హైదరాబాద్ లో జరిగే అక్రమ కార్యకలాపాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.