ప్రణయ్ చనిపోడానికి అమృత చేసిన ఈ పొరపాటే కారణమా? వెలుగులోకి వచ్చిన అసలు నిజం

503

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును అతితక్కువ సమయంలోనే చేధించారు.భర్త మరణం నుంచి అమృత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.నిందితులకు శిక్ష పడ్డప్పుడే తనకు ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అమృత చెప్పింది.అయితే ప్రణయ్ హత్య జరగడానికి ఒకరకంగా అమృతనే కారణం. తెలిసీతెలియక అమృత చేసిన ఒక పని వలన ప్రణయ్ చనిపోయాడు.మరి అమృత చేసిన ఆ పొరబాటు ఏమిటో చూద్దామా.

Image result for pranay and amrutha

ప్రణయ్ చనిపోడానికి ఒకరకంగా అమృతనే కారణం అని తెలుస్తుంది.ఆమె తెలియక చేసిన ఒక తప్పు వలన భర్తను కోల్పోయింది.అమృత ఏం చేసింది అనుకుంటున్నారా.అమృత వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడడమే ఆమె చేసిన పొరబాటు.ప్రణయ్ ను చంపేందుకు మారుతీరావు తన భార్య గిరిజారాణిని నమ్మించాడు. భార్య గిరిజారాణితో పలుమార్లు అమృతకు ఫోన్‌ చేయించి ఎప్పటికపుడు సమాచారం తెలుసుకున్నాడు. భార్యకు, కూతురుకు ఎలాంటి అనుమానం రాకుండా తాను కూడా అప్పుడప్పుడు అమృతతో మాట్లాడాడు. హత్యకు ముందు రోజు కూడా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్ చేసి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపింది.ఆ తర్వాత తల్లి గిరిజారాణి పూజ ఎలా చేసుకున్నామో తెలిపారు. తర్వాత రోజు అమృత, ప్రణయ్‌లు ఆసుపత్రికి వస్తారని మారుతిరావు తెలుసుకున్నారు. హత్యకు ప్లాన్ చేశారు. కన్నతల్లి ప్రేమతోనే మారుతి రావు అమృత భర్తను చంపేశాడు.

Image result for pranay and amrutha

అమృత తల్లికి తెలియకుండానే ఈ వ్యవహారం నడిచింది. అబ్దుల్ బారీ, మారుతీరావు, కరీం, హత్య చేసిన సుభాష్‌ శర్మ కలిసి మిర్యాలగూడ ఆటోనగర్‌లో హత్యకు ప్లాన్ చేశారు. అమృత, ప్రణయ్‌లు తిరిగే ప్రదేశాలు గుర్తించారు. ప్రణయ్‌ను ఎలా హత్య చేయారో చర్చించారు.ఆగస్టు 19న అమృత-ప్రణయ్‌లు మిర్యాలగూడలో డిన్నర్ ఇచ్చారు. దీంతో మరింత రగిలిపోయిన మారుతీరావు ప్రణయ్‌ను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవాలనుకున్నాడు. ప్రణయ్‌ హత్య తర్వాత నల్గొండకు చేరుకున్న అస్గర్, సుభాష్ శర్మలు హైదరాబాద్‌ వెళ్తూ చౌటుప్పల్‌ వద్ద ఆగి అబ్దుల్‌బారీకి ఫోన్‌ చేశారు. పని పూర్తయిందని తెలిపారు. అబ్దుల్‌ బారీ ఈ విషయాన్ని మారుతీరావుకు చెప్పాడు. మిగిలిన డబ్బుల కోసం డిమాండ్‌ చేశాడు. తర్వాత మారుతీరావును పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకోవడంతో నిందితులంతా వెలుగులోకి వచ్చారు.

 

హత్య తర్వాత తాను ఆ ప్రదేశంలో లేనంటూ మారుతీరావు నమ్మించడానికి పెద్ద ప్లాన్ ప్లాన్‌ వేశాడు. హత్య మధ్యాహ్నం జరగ్గా అతడు అంతకు 2 గంటల ముందే మిర్యాలగూడ నుంచి నల్గొండ బయలుదేరాడు. మధ్యలో వేములపల్లి వద్ద అవసరం లేకపోయినా ఆగి ఆర్డీవో, డీఎస్పీని పలకరించాడు. నల్గొండకు కలెక్టరేట్‌కు వెళ్లి ఏం పనిలేకపోయినా జేసీ లేదా కలెక్టరును కలవడానికి ప్రయత్నించాడు. హత్య జరిగిందని తెలియగానే తన వాహనాన్ని నల్గొండలో వదిలేసి మరో వాహనంలో హైదరాబాద్ వెళ్లిపోయాడు.చూశారుగా అమృత చేసిన ఒక్క పొరబాటు వలన ఎంత పెద్ద దారుణం జరిగిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అమృత చేసిన పొరబాటు గురించి అలాగే మారుతీరావు పన్నిన కుట్ర గురించి ఆ కుల అహంకార హత్య గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.