మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ? వెంటనే ఈ వీడియో చూడండి..లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం

1546

మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ వస్తువులు, సామాగ్రి దగ్గర పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెప్పలేం. రోజూ వాడుతున్న వస్తువులే హఠాత్తుగా ఫెయిల్ అయ్యి ప్రాణాలనే తీసేయొచ్చు. వంటింట్లోని ఎల్‌పీజీ సిలిండర్లే కాదు ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. కూల్ కూల్‌గా ఉండే ఫ్రిడ్జ్ లు పేలి మ‌నుషుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని బొంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్రిజ్‌ కంప్రెజర్‌ పేలడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి దీపిక సజీవదహనమైంది.మరి ఆ దారుణ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for freez

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొప్పుల మనోహర్-లావణ్య దంపతులు ఐదేళ్లుగా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె దీపిక (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తల్లిదండ్రులు విధులుకు, సోదరి స్కూల్‌కు వెళ్లడంతో ఇంట్లో గడియపెట్టుంది. ఆమెకు త్వరలో పరీక్షలు ఉండటంతో.. ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. మధ్యాహ్నం సమయంలో దాహం వేడయంతో నీళ్లు తాగేందుకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసింది. వెంటనే కంప్రెస్సర్ పేలిపోయి మంటలు చెలరేగాయి.ఈ పేలుడు దెబ్బకు దీపిక ఎగిరిపడింది. ఆమెకు మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఫ్రిజ్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. ఇంట్లో నుంచి పేలుడు శబ్ధం రావడంతో ఇరుగురుపొరుగువారు అక్కడికి పరుగులు తీశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పెద్ద శబ్ధం, మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని ఇంట్లో కరెంటు సరఫరా నిలివేసి మంటలను చల్లార్చారు. దీపిక మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఫ్రిజ్‌లోని కంప్రెసర్‌తో పాటూ సిలిండర్ పేలడం వల్లే ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దీపిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. చూశారుగా ఫ్రిడ్జ్ పేలి ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో. కాబట్టి ఎలక్ట్రిక్ వస్తువులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఫ్రిడ్జ్ పేలి చనిపోయిన ఈ అమ్మాయి ఘటన గురించి దానికి గల కారణం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.