భార్య బండారాన్ని బయటపెట్టిన సీసీ కెమెరా చూసి షాకైన పోలీసులు

386

సైదాబాద్‌లో బుధవారం పట్టపగలు వృద్ధ దంపతులపై దాడి, దోపిడీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇల్లు ఖాళీ చేసే విషయంపై భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో భార్య రోకలిబండతో భర్తపై దాడి చేసి ఇంట్లో కత్తితో తనకు తాను గాయపపర్చుకుని దొంగల దాడిగా సృష్టించింది. సైదాబాద్‌ పర్హాకాలనీలో ట్రాన్స్‌కో రిటైర్డ్‌ ఏఈ షరాప్‌ వామనమూర్తి. భార్య అనురాధ అక్క‌డ నివాసముంటున్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు అమీర్‌పేటలో, కూతురు బెంగళూర్‌లో నివసిస్తున్నారు. వామనమూర్తికి అప్పులు అధికం కావడంతో పర్హాకాలనీలోని ఉంటున్న ఇంటిని 2017లో రూ.60 లక్షలకు అమ్మాడు. కానీ ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కొనుగోలు చేసిన వారు ఏడాదిన్నర కాలంగా ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

Image result for illegal affair
ఈ క్రమంలో ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలన్న బాధ, డబ్బుల విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో కోపంతో ఆమె రోకలిబండతో భర్త తలపై రెండు సార్లు బలంగా మోదింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇంటి వెనుక బాత్‌రూంలోకి వెళ్లి తలపై నీళ్లు పోసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పనిమనిషితో.. ఈ విషయం బయటకు చెప్పొద్దని ఒట్టు పెట్టుకుంది. అనంతరం పనిమనిషి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికి అనురాధ తనకు తాను కత్తితో గాయపర్చుకుని బయటకు పరుగెత్తి పొరుగింటి వారిని పిలిచి దోపిడీ దొంగల బీభత్సంగా నమ్మబలికింది. చేతులకు గాయాలైన అనురాధను, ఇంటి వెనుక బాత్‌రూమ్‌లో కుప్పకూలిన వామనమూర్తిని స్థానికులు చికిత్స నిమి త్తం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు భిన్న కథనాలు చెప్పారు. చివ‌ర‌కు లోతుగా విశ్లేషించగా వృద్ధ దంపతుల డ్రామా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఓ సారి వామనమూర్తిపై అనురాధ దాడి చేసి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిందని తెలిసింది. అంతేగాకుండా చిన్న చిన్న విషయాల్లో భార్యాభర్తలు తరచుగా గొడవపడేవారని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

వృద్ధ దంపతుల నాటకాన్ని సీసీ కెమెరా బట్టబయలు చేసింది. అనురాధ తమపై దోపిడీ దొంగలు దాడి చేసి పారిపోయారని పోలీసులకు చెప్పడంతో ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఉదయం 11.30 గంటలకు పనిమనిషి బయటకు వెళ్లిన తరువాత 11.40 గంటల వరకు బ‌య‌ట వారు ఎవరూ లోపలికి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వెనుక ప్రాంతాలలో సైతం సీసీ ఫుటేజీని పరిశీలించి దొంగలు ఎవరూ రాలేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు సంఘటన జరిగిన సమయంలో దంపతులు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నారు. అంతకు ముందు ఇంటి నుంచి వెళ్లిన పనిమనిషిని పోలీసులు విచారించగా వారి గుట్టు రట్టయింది. ఈమె తెలివితేట‌లు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.