ఆగష్టు 27న ఆకాశంలో రెండు చందమామలా..ఇందులో నిజమెంత..

465

విశ్వం.. ఓ రహస్యాల పుట్టుక. అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి మన అందరికి తెలుసు.ఆకాశంలో చందమామ సూర్యుడు మినుమినుకుమనే తారలతో విశ్వం ఎంతో అందంగా కనిపిస్తుంది.అయితే విశ్వం గురించి అప్పుడప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి.విశ్వంలో అది జరుగుతుంది.ఇది జరుగుతుంది అనే వార్త కోడై కూస్తుంది.ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి హల్చల్ చేస్తుంది.భూమికి దగ్గరలోకి అంగారక గ్రహం రాబోతుంది అనే వార్త బయట చక్కర్లు కొడుతుంది.ఆకాశంలో రెండు చందమామలు ఒకేసారి కనిపిస్తాయంటా.మరి ఇందులో నిజమెంత.నిజంగానే కనిపించాబోతున్నాయా.పూర్తీగా చెబుతా వినండి.

Image result for chandra grahan

ఆగస్టు 27, 2018 న ఆకాశంలో మహాద్భుతం జరగబోతుంది.ఆకాశంలో చందమామకు తోడుగా మార్స్ తోడవుతుంది.ఇలాంటి అధ్బుతం ఎన్నాళ్ళకో కానీ కనిపించదు.భూమికి దగ్గరలో మార్స్ రావడంతో ఖగోళ అధ్బుతం చోటుచేసుకోనుంది.సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు ఈ అధ్బుతం చోటుచేసుకోనుంది.కాబట్టి ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వకండి అంటూ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి.సోషల్ మీడియాలో ఈ విషయన్ని షేర్ చేస్తున్నారు.మరి నిజంగా చందమామలు కనిపిస్తాయా అంటే నో అనే చెప్పాలి.

Image result for chandra grahan

ప్రతి ఏడాది ఆగష్టు 27 దగ్గర పడేకోద్ది ఇలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.ఇది తెలియని వ్యక్తులు షేర్ చేస్తున్నారు.అయితే ఈ వార్త స్ప్రెడ్ అవ్వడానికి ఒక కారణం ఉంది.2003 ఆగష్టు 27 న భూమికి మార్స్ చాలా దగ్గర వచ్చింది.అప్పుడు రెండు చంద్రులు ఆకాశంలో ఉన్నట్టు కనిపించింది.ఇలాంటి అధ్బుతం 60 ఏళ్లకు ఒకసారి గానీ జరగదు.భూమికి మార్స్ ఎంత దగ్గరగా వచ్చింది అంటే 56 మిలియన్ కి.మీ.దూరంలోకి వచ్చింది.ఆ మార్స్ ఒక పెద్ద నక్షత్రం మాదిరి కనిపిచింది.ఇక 2007 లో కూడా ఇలాంటి వార్తే ఒకటి జరిగింది.అప్పుడు కూడా రెండు చందమామలు అని పుకారు వచ్చింది.ఈ వార్త అయితే ప్రపంచం మొత్తం పాకిపోయింది.ఆ తర్వాత సైంటిస్టులు చెప్తే కానీ అది రూమర్ అని అర్థం కాలేదు.ఇప్పుడు కూడా ఈ రెండు చందమామలు కనిపిస్తాయి అని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ ఇందులో నిజం లేదు.కనిపించడం పక్కన పెట్టండి అసలు మార్స్ భూమి దగ్గరలోకే రావడం లేదు.ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే..మార్స్ ఎప్పుడు చందమామ ఆకారంలో అస్సలు కనిపించదు.ఒకవేళ నిజంగా మార్స్ భూమికి దగ్గరలో వస్తుంది అంటే ఏదో పెద్ద ప్రళయం సంభావిస్తున్నట్టే.ఎందుకంటే కక్ష్యలో తేడా వచ్చిందంటే విశ్వంలో ఏదో జరుగుతున్నట్టే కదా.కాబట్టి ఎప్పటికి ఇలాంటి పుకార్లు అస్సలు నమ్మకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మార్స్ దగ్గరకు వస్తుంది అని వస్తున్న పుకారు గురించి అలాగే మార్స్ ఒకవేళ దగ్గరకు వస్తే కలిగే పెను ప్రమాదం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.