ఆ రాష్ట్రంలో ఎలుక మాంసం ఎంత రేటో తెలుసా…? డిమాండ్ తెలిస్తే నోరెళ్లబెడతారు

458

ఎలుక అంటే ఆమ్మో అంటాము. ఇక ఎలుక మాంసం తినే వారి గురించి తెలిస్తే… ఛీ.. ఛీ అంటాము . కానీ మనకు చేపలు.. చికెన్ కి ఉన్నట్టే … మనదేశంలో ఓ రాష్ట్రంలో ఎలుక మాంసానికి కూడా బాగా డిమాండ్ ఉంది.ఇక్కడ మనం చికెన్ బిర్యానీ ఎలా అయితే తింటామో అక్కడ ఎలుక బిర్యానీని తింటారు. అక్కడ కిలో ఎలుక మాంసం మనకు చికెన్ రేటు వలే కేజీ 200 వరకు పలుకుతోంది. అదెక్కడ ఉందొ ఎలుక మాంసానికి అంత డిమాండ్ ఎందుకో తెలుసుకుందామా.

Image result for rat meat

మనదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉన్న బక్సా జిల్లాలోని కుమారికటా గ్రామస్తులు చికెన్ మటన్ కంటే ఎలుక మాంసానికే అధిక ప్రాధాన్యమిస్తారు. ఆదివారం రాగానే ప్రజలంతా ఎలుక మాంసం కోసం క్యూ కడతారు. బ్రాయిలర్ చికెన్‌తో సమానంగా ఎలుక మాంసం ధరలు ఉంటున్నాయంటే అక్కడ డిమాండు ఏ మేరకు ఉంది అనేది మీకే తెలుస్తుంది. గువహతీకి సుమారు 90 కిమీల దూరంలో ఉన్న ఇండియా-భూటాన్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ప్రతి ఆదివారం తాజా ఎలుక మాంసాన్ని విక్రయిస్తారు. వీటి కోసం అస్సాం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తారు.ఆరోజంతా మార్కెట్ లో ఎలుకలు తప్ప మరె ఇతర వస్తువులను అమ్మరు. కేవలం ఎలుకలను కొనడానికి మాత్రమే వస్తారు. అంతేనా వాటిని అక్కడే కట్ చేపించుకుని పీసులు పీసులు చేసి ఇంటికి తీసుకెళ్తారు. మనం చేపల మార్కెట్ కు వెళ్తే అక్కడ చేపలను కట్ చేసి ఇంటికి తీసుకెళతాం కదా అలా అన్నమాట.

ఎలుక మాంసానికి ఉన్న గిరాకీ వల్ల అక్కడి రైతులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీరు ఎలుకలను ఎందుకు తింటారనడానికి ప్రత్యేక కారణమైతే ఏదీ లేదు. ఎన్నాళ్ల నుంచో సాంప్రదాయకంగా వస్తున్న వంటకంగా ఎలుకలను ఆరగిస్తున్నారు. ఎలుకలు రాత్రి వేళల్లో కన్నాల నుంచి బయటకు వస్తాయి. దీంతో రైతులు రాత్రి వేళ్లల్లో కర్రలతో నిర్మించిన బోనులను వ్యవసాయ క్షేత్రాల్లో పెడతారు. బోనులో పడిన ఎలుకలను కొద్ది రోజులు పోషించి, ఆదివారం మార్కెట్లకు తరలిస్తారు. ఎలుకలను పట్టుకోవడం వల్ల ఆదాయమే కాకుండా తమ పంటలను రక్షించుకోగలుగుతున్నాం అని రైతులు చెబుతున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఎలుక మాంసం గురించి అలాగే దానికి ఉన్న డిమాండ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.