నేపాల్ దేశం గురించి షాకింగ్ నిజాలు

428

నేపాల్ ఈ దేశం పేరు విన‌గానే మ‌న ప‌క్క దేశం అని వెంట‌నే చెబుతాం.. ఇక ఈ దేశం గురించి ప్ర‌త్యేక‌త‌లు అనేకం ఉన్నాయి.. నేపాల్ గురించి వాటి ప్ర‌త్యేక‌త‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం… నేపాల్ దేశం శీతల దేశం.. ఇదంతా చాలా చ‌లిప్రాంతం అనే చెప్పాలి..నేపాల్ దేశ జ‌నాభా 2 కోట్ల 35 వేలు ఉంటారు అని గ‌త సెన్సెస్ లెక్క‌లు చెబుతున్నాయి… నేపాల్ దేశ రాజధాని ఖాట్మాండ్.. నేపాల్ అధికారిక భాష నేపాలీ.. ఇక్క‌డ అంద‌రూ ఇదే మాట్లాడ‌తారు. ఇక్క‌డ క‌రెన్సీ మ‌న‌కు రూపాయి ఎలా ఉంటుందో అలాగే నేపాలీ రూపీని ఇక్క‌డ క‌రెన్సీగా వాడతారు.

ప్రపంచంలో ఎంతో విశిష్టమైన ఎత్తైన ఎవ‌రెస్ట్ శిఖ‌రం ప‌ర్వ‌తాలు నేపాల్ లోఉన్నాయి.. నేపాల్ కు ప్ర‌తీ ఏడాది ల‌క్ష‌లాది మంది టూరిస్టులు వ‌స్తారు ఇది టూరిస్ట్ హ‌బ్ అనే చెప్పాలి.. ఇక భార‌త్ నుంచి ఇక్క‌డ‌కు ఎవ‌రు వెళ్లినా ఎటువంటి పాస్ పోర్టు, వీసా అవ‌స‌రం లేదు.. అలాగే ఇక్క‌డ‌కు వెళ్లడానికి మ‌న భార‌తీయుల‌కు ఎటువంటి అనుమ‌తి ప‌త్రాలు తీసుకోవ‌ల‌సిన‌ అవ‌సరం లేదు..

ఇక్క‌డ మిగిలిన ప్రాంతాల‌తో పోలిస్తే ఇంట‌ర్ నెట్ స్పీడ్ చాలా త‌క్కువగా ఉంటుంది…ఇక్క‌డ ఇంట‌ర్ నెట్ యూజ‌ర్స్ ఇప్ప‌టికీ 265 కేబీ కంటే త‌క్కువ‌గా ఉండే స్పీడుతోనే ఇంట‌ర్నెట్ వాడుతున్నారు… ఎక్కువ‌గా కొండ ప్రాంతం అలాగే చుట్టూ ప‌ర్వ‌తాలు ఉండ‌టంతో ఇక్క‌డ‌ టెలీ క‌మ్యూనికేష‌న్ అంతా వ్యాపించ‌దు…. అందుకే ఇక్క‌డ ఇంట‌ర్ నెట్ త‌క్కువు స్పీడుతో అందుతుంది.. ఇది హిందూ దేశం అనే చెప్పాలి ఇక్క‌డ‌ 80శాతం హిందువులు ఉన్నారు.. మిగిలిన 20 శాతం బౌద్ద‌, క్రిస్టియ‌న్స్, ముస్లింలు మాత్ర‌మే ఉన్నారు.

క్రిస్తుపూర్వం రెండోవ శ‌తాబ్దంలో భార‌త దేశంతోపాటు నేపాల్ ద‌క్షిణ ప్రాంతం కూడా అశోకుడు ప‌రిపాలించాడు….ఇక్క‌డ ఇత‌ర దేశాల నుంచి వ‌స్తువులు దిగుమ‌తి అవుతాయి… ఇక్క‌డ అన్ని ర‌కాల వ‌స్తువులు అమ్ముతారు.. ఈ ప్రాంతంలో ఎక్కువగా చెర‌కు, పొగాకు పండిస్తారు.. ఇప్పుడిప్పుడే ఇక్క‌డ వ‌స్త్ర‌ప‌రిశ్ర‌మ‌లు కూడా పెరుగుతున్నాయి… ఇక్క‌డ ద‌ట్ట‌మైన అడ‌వులు కూడా ఉండ‌టంతో రుద్రాక్ష‌లు ఈ అడ‌వుల్లో ఎక్కువ‌గా పండుతాయి…ఈ రుద్రాక్ష‌లు నేపాల్ నుంచి మ‌న దేశానికి ఎక్కువ‌గా అమ్మ‌కానికి తీసుకువ‌స్తారు.. వీటిలో ఎంతో విశిష్ట‌మైనవి ఏక‌ముఖి రుద్రాక్షలు.. ఇవి ఎంతో ఖ‌రీదైన‌వి చాలా విలువైన‌వి, శివునిని ఎక్కువ‌గా ఆరాధించేవారు ఈ ఏక‌ముఖి రుద్రాక్ష‌ల కోసం ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చుపెడ‌తారు…ఈ దేశంలో ఎవ‌రైనా వేరే వ్య‌క్తుల‌ను క‌లిసిన స‌మ‌యంలో వారికి రెండు చేతులు జోడించి న‌మ‌స్కారం పెడతారు. చూశారుగాఇవి నేపాల్ గురించి కొన్ని ప్ర‌త్యేక‌మైన విష‌యాలు.