అమ్మాయి పుష్పావతి అవ్వడం శుభ మరియు అశుభ ఫలితములు

451

రజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అవ్వడం. మొదటిసారి స్త్రీ రజస్వల అయితే పుష్పవతి, పెద్దమనిషి అయినదని అంటారు. నెల నెల రజోదర్శనము అవ్వడాన్ని బహిష్టు అంటారు. మొదటిసారి రజస్వల మధ్యాహ్నము లోపు అయితే శుభము అని మిగిలిన కాలము అయితే అశుభము అని అంటారు..అయితే కొన్ని తిధులలో కూడా పుష్పావతి అవ్వకూడదు. అమావాస్య, ఉభయ పాడ్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదులలో పుష్పావతి అవ్వకూడదు. తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము కలుగును. ఇక వారాల విషయానికి వస్తే… సోమ, బుధ, గురు, శుక్ర వారములలో అయితే శుభం, ఆది, మంగళ, శని వారలలో అయితే అశుభం కలుగుతుంది. ఇక నక్షత్రాల విషయానికి వస్తే…అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి… ఇలా ఈ నక్షత్రాలలో పుష్పావతి అయితే సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. గ్రహణ సమయాలలో, సంక్రాంతి నాడు, అర్ధరాత్రి పూట, పుష్పావతి అయితే శాంతి పూజలు చేయించాలి. రజస్వల సమయంలో నక్షత్రంలో గురుడు గాని, శని గాని ఉంటె మంచి జరుగును.అలాగే రజస్వల సమయంలో కుజుడు ఉన్నా, బుధశుక్రులు కలిసి ఉన్నా, రవి ఉన్నా, రాహు కేతువులున్నా అశుభము జరుగును..

Related image

ఇక రజస్వల అయినా స్థలం బట్టి కూడా ఫలితాలు జరుగును. తన ఇంట్లో, గొడ్డల చావిడిన, గ్రామ మధ్యలో, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్యలో అయితే శుభం జరుగును. గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల ఇళ్లలోనూ అయితే అశుభం జరుగును. ఇక ఏ సమయంలో అయ్యింది అనే దానిని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. తెల్లవారు జామున అయితే సౌభాగ్యం, తెల్లారిన తర్వాత అయితే సౌభాగ్యలోపం, మధ్యాహ్నం అయితే ధనవతి, పుత్రవతి, సాయంత్రం అయితే సుఖసంతోషాలు కలుగును. ఒకవేళ రాత్రి సమయంలో అయితే కొంచెం చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆమె వేసుకున్న బట్టలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. తెల్లబట్టలు వేసుకుంటే సౌభాగ్యవతి, గట్టి బట్టలు వేసుకుంటే పతివ్రత, నూలు దుస్తులు వేసుకుంటే పట్టపురాణి, కొత్త బట్టలు వేసుకుంటే శుభ సంపన్నురాలు, చిరిగిన బట్టలు వేసుకుంటే దౌర్భాగ్యురాలు, ఎర్రని బట్టలు వేసుకుంటే వ్యాధి బారిన పడటం, నల్లని బట్టలు వేసుకుంటే దరిద్రురాలుం అవుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

రజోవతి అయిన స్త్రీ మొదటి రోజు చండాల స్త్రీతో సమానం, రెండవ రోజు పతితురాలితో సమానం, మూడవ రోజు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ రోజు శూద్ర స్త్రీతో సమానం, అయిదవ రోజు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు. పుష్పావతి అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చోబెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసనకు శ్రీ గంధము, పువ్వులను, తాంబూలము, లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. పుష్పావతి అయిన బట్టలతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా ఉండేలా చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఉండాలి., నాలుగవ రోజు స్నానము చేయించి కొత్త బట్టలు కట్టించాలి. మూడు రోజులు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట, అగ్ని ముట్టుట, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యము కొరకు పాటించే నియమములు..ఇలా పుష్పావతి అయినా మహిళ జీవితంలో జరిగే కొన్ని ఘట్టాలు.