30 సం.లలోనూ అమ్మాయిలు అందంగా ఎందుకు కన్పిస్తున్నారు..

177

ప్రస్తుత జనరేషన్ లో 30 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయిలు కూడా చాలా అందంగా ఫ్రెష్ లుక్ తో కనిపించడం సర్వ సాదారణం అయింది..ఇందుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల కాస్మొటిక్స్ తో పాటు మారిన నేటి తరం అమ్మాయిల ఆలోచనలు వరి రొమాంటిక్ లైఫ్ లాంటి ఎన్నో విషయాలు వారు 30 లలోనూ అందంగా కనిపించేలా చేస్తున్నాయి..వారు అలా కనిపించడానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..

Image result for 30years girls

వయసును చూసే కోణం మారింది..

దశాబ్దం క్రిందటి వరకూ అమ్మాయిల్లో 20 నుంచి 25 ఏళ్ళ వయసు మధ్యలోనే తమ అందం ఉంటుందని.. 30 దాటే సమయానికి తమలో వృద్దాప్య చాయలు ప్రారంభం అవుతాయని అందం తగ్గుతూ పోతుందని భయపడేవారు..మారుతున్న ఆలోచనలు అందుకు తగినట్టుగా డెవలప్ అయినా బ్యూటీ కాస్మొటిక్ ఇండస్త్రీ..మెడికల్ టెక్నాలజీ ఇప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా కనిపించేలా చేస్తున్నాయి..అమ్మాయిలలో ఒకప్పటి భయం ఆత్మ విశ్వాస లోపం ఇప్పుడు లేదు..ఇది వారిని మరింత ఆకర్షణీయంగా అందంగా కనబడేలా చేస్తోంది..

Image result for 30years girls in india

అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ వినియోగం..

ఈ తరం అమ్మాయిలు కాస్మెటిక్ ఇండస్ట్రీలో వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా వాడడానికి సంకోచించడం లేదు..కలర్ తక్కువైనా ముఖంపై ఏమైనా లోపాలు ఉన్నా ఇలా ప్రతీ సమస్యకు ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీ దగ్గర సమాధానం ఉంది..అంతలా కాస్మెటిక్ ఇండస్ట్రీ డెవలప్ అయింది..అందంగా కనిపించడం కోసం ఉన్న ఏ అవకాశాన్ని ఇప్పుడున్న అమ్మాయిలు వదులుకోవడం లేదు..ఆర్ధిక స్వాతంత్ర్యం స్వతంత్ర భావాలు ఉన్న ఇవాల్టి మహిళలు 30 దాటిన తరువాత కూడా ఫ్రెష్ గా యంగ్ గా కనిపిస్తున్నారు..ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే కాదు రకరకాల మాస్కులు స్కిన్ ట్రీట్మెంట్లు ఇలా అందంగా కనిపించడానికి వీలున్న ప్రతీ అవకాశాన్ని వారు అందిపుచ్చుకుంటున్నారు..

Image result for 30years girls in india

వారి స్టైల్ ఏంటో వారికి తెలుసు..

కొన్నేళ్ళ క్రిందట మహిళలకు కావాల్సిన బట్టలు కొనుక్కోవాలంటే వారికి సరిపడేవి నచ్చేవి దొరక్క ఇబ్బంది అయ్యేది..ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆదారపడవలసి వచ్చేది..కానీ ఇప్పుడు ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటున్నాయి..టీ షర్ట్స్ షూస్ సన్ గ్లాస్ ఇలా ఫ్యాషనబుల్గా కనిపించడానికి ఏది అవసరమో దాన్ని సొంతం చేసుకుంటున్నారు స్త్రీలు..పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఫ్యాషన్ బౌటిక్ లలో వందల వేల వెరైటీలు దొరుకుతున్నాయి..ఎన్ని ఉన్నా తమకు ఏం కావాలో తమకు ఏది నచ్చుతుందో ఇప్పటి తరానికి సరిగా తెలుసు..అందులోనూ అమ్మాయిలకు తాము ఎలా బాగుంటాము అనే దానిపై ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది..ఎవరో ఏదో అనుకుంటారనే భయం తొలగిపోయింది..తమకు నచ్చినట్టు ఎలా ఉండాలో వారి స్టైల్ ఏంటో వారికి తెలుసు..

Image result for 20years girls in india

పెరిగిన సెల్ఫ్ రెస్పెక్ట్:

ఇంతకుముందు లేని ఆత్మ గౌరవం ఇప్పటి అమ్మాయిల్లో కనబడుతోంది..పూర్వం కుటుంబాల్లో కుటుంబ పెద్దలు లేదా పెద్ద వయసున్న వారి సలహాలను మిగతా కుటుంబ సభ్యులు పాటించేవారు..వారి నిర్ణయాలను వ్యతిరేకించేవారు కాదు..అయితే ఇప్పటి తరం స్త్రీలు ఈ కట్టుబాటును సహించే స్థితి లేదు..చాలావరకు తమకున్న పరిఙానంతో తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న నమ్మకం వారిలో బలంగా కనబడుతోంది..ఇదే వారిని మరింత సెల్ఫ్ కాంఫిడెంట్ గా ప్రొజెక్ట్ చేస్తోంది..ఈ కారణంగానే 30 ఏళ్ళు వయసు వచ్చేసరికి జీవితం కెరీర్ సమాజం పైనా ఒక అవగాహన ఏర్పరచుకొని సరైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు..నిర్ణయం ఏదైనా ఒకసారి తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటున్నారు..ఈ తత్వమే వారిని మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేస్తోంది..

Image result for 20years girls in india

శరీరంపై సరైన అవగాహన..

తన శరీర తత్వాన్ని అర్దం చేసుకోవడంతో పాటు ఎంత నీరు త్రాగాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ వ్యాయామం చేయాలి అన్న అవగాహన ఇప్పటి స్త్రీలలో ఎక్కువగా ఉంటోంది..ఒకప్పుడు ఈ అవగాహన చాలా తక్కువగా ఉండేది..కానీ ఇప్పుడు అమ్మాయిలు వెల్ ఎడ్యుకేటెడ్ అవడం వలన లైఫ్ లో ప్రతీ యాస్పెక్ట్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటోంది..ఇది కూడా వాళ్ళు స్వతహాగా అందంగా ఉండడానికి కారణం అవుతోంది..

Image result for 20years girls in india

తమదైన ఫ్యాషన్ శైలి:

కొన్నాళ్ళ క్రిందటి వరకూ 20 సంవత్సరాల వయసు దాటుతున్నది అంటే ఇళ్ళల్లో అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆంక్షలు ఉండేవి..బ్రైట్ కలర్ డ్రెస్సులు షార్ట్ కట్స్ ఫన్ క్లాతీ గాగుల్స్ వంటి వాటికి పెద్దవాళ్ళు అనుమతించేవారు కాదు.. సమాజం కూడా తాము ఇష్టమైనవారిని భిన్నంగా ఉండేవారిని చూసేది..కానీ ఇవాల్టి అమ్మాయిలు ఇందుకు పూర్తి వ్యతిరేకం..తాము ఎలా ఉండాలో ఇంకొకరు నిర్దేశించాల్సిన అవసరం లేదని వారు అనుకుంటారు..తామకు నచ్చినట్టుగా ఫ్యాషన్‌బుల్ గా ఉండడానికి ఈ తరం యువత మొగ్గు చూపుతోంది..ఫేడెడ్ జీన్స్ హెయిర్ కలర్ టాటూస్ పీర్సింగ్ గాగుల్స్ ఇలా తమకు నచ్చినట్టుగా ఉండే స్వేచ్చ కావాలనుకుంటున్నారు..అలాగే ఉంటున్నారు..

ఈ క్రింద వీడియోని చూడండి

మంచి రొమాంటిక్ లైఫ్..

ఈ రోజుల్లో అమ్మాయిలు ఉద్యోగలు చేయడం చాలా కామన్ అయింది..అమ్మాయిలు కూడా ఆర్ధికంగా స్థిరపడిన తరువాత మాత్రమే పెళ్ళి చేసుకుంటున్నారు..ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు 25 సంవత్సరాల తరువాత పెళ్ళి చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు..వారికి రావాల్సిన ఆర్ధిక స్వేచ్చ వచ్చిన తరువాత పెళ్ళి చేసుకుంటున్నారు..కాబట్టి ఎటువంటి బిడియం లేకుండా పెళ్ళి తరువాత భర్తతో మంచి రొమాంటిక్ లైఫ్ ను ఆనందిస్తున్నారు..ఆనందంతో కూడిన రొమాన్స్ అమ్మాయిలను 30 సంవత్సరాల వయసులోనూ ఆనందంగా కనిపించేలా చేస్తోంది..బిడియాన్ని వదిలేసి మంచి రొమాంటిక్ లైఫ్ కోసం అమ్మాయిలు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు..

Image result for 20years girls in india

ఆర్ధిక స్వాతంత్రం..

కొన్ని దసాబ్దాల క్రిందటి వరకూ మహిళలు ఉద్యోగాల్లో ఉండడం చాలా తక్కువగా ఉండేది..గడిచిన 2 దసాబ్దాలలో చదువుకునే అమాయిల సంఖ్య పెరిగి తత్ఫలితంగా ఉద్యోఅగాలలో కూడా అబ్బాయిలకు ధీటుగా పోటీ పడుతున్నారు..సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ది చెందడం కూడా మహిళల్లో ఉద్యోగిత పెరగడానికి కారణం అయింది..ఇవాల తమ తెలివితేటలు నైపుణ్యంతో అన్ని రంగాల్లో మగవారికి ధీటుగా స్త్రీలు రాణిస్తున్నారు..ఈ పరిణామమే వారికి ఆర్ధిక స్వాతంత్రం కూడా ఇచ్చింది..ఒకప్పటి తమ అవసరాలకు ఆకాంక్షలకు ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి మారింది..బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి షాపింగ్ చేయడానికి వెకేషన్ కి ఇతర ప్రదేశాలకు వెళ్ళి రావడానికి ఇవాల్టి మహిళ వెనుకాడడం లేదు..ఇది వాళ్ళ లైఫ్ ను మరింత సంతోషంగా గడపడానికి దోహదం చేస్తోంది..తమ కోసం తాము డబ్బు ఖర్చు పెట్టదానికి ఏ మాత్రం ఫీలవదు ఈ నాటి యువత.. ఇది అమ్మాయిల విషయంలో స్వాగతించదగినదే..

Image result for 20years girls in india

కాస్మొటిక్స్ పట్ల భిన్నాభిప్రాయం..

కొన్ని సంవత్సరాల క్రితం మేకప్ అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వేసుకునేదిగా ఉండేది..ఒకవేళ ఎవరైనా మేకప్ వేసుకున్నా లిప్ స్టిక్ వాడినా కాస్త వింతగా చూసేవారు..మేకప్ టూల్స్ ఏ కొంతమందికో అందుబాటులో ఉండేవి..కాలం మారింది..ఈ దసాబ్దంన్నర కాలంలో బ్యూటీ ఇండస్ట్రీ ఎంతగానో పెరిగిపోయింది..ఇప్పుడు హైలైతర్స్ లిట్టర్స్ లాంటి మేకప్ టూల్స్ ఎన్నో వచ్చాయి..ఈ మార్పులు మేకప్ కాస్మెటిక్స్ పై మహిళల ఆలోచనలే మారిపోయేలా చేసాయి..ఇవాళ 30 దాటిన అమ్మాయిలు ఇంకా యంగ్ గా ఫ్రెష్ లుక్ తో కనబడాలని కోరుకుంటున్నారు..మెట్రో సిటీలలో అందరూ ప్రతీ రోజు మేకప్ చేసుకుంటున్నారు..

Related image

ఆరోగ్యం పట్ల శ్రద్ద..

జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం అనే స్పృహ ఇప్పుడు బాగా పెరిగింది.. ఈ స్పృహ ఉండడం కూడా ఆడవారిలో ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి..మగవరితో పొలైస్తే స్త్రీలకు హెల్త్ కాన్షియస్‌నెస్ ఎక్కువగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటుంది..చెడు అలవాట్లు తక్కువగా ఉంటాయి..మెడికల్ అడ్వాన్స్మెంట్ మెడికల్ టెక్నాలజీ డెవలప్మెంట్ తో అంతకుముందు ట్రీట్మెంట్ లేని ఎన్నో వ్యాధులకు ఇప్పుడు చెక్ పెట్టగలుగుతున్నారు..స్త్రీలకు ప్రత్యేకమైన హాస్పిటల్స్ వచ్చేసాయి..ఇది కొన్ని దసాబ్దాలకు ముందు లేని సౌలభ్యం..ఈ రకంగా ఈ తరం అమ్మాయిలకు ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగింది..దీనికి తోడు ఆరోగ్యకరమైన ఆలోచనలు కలిగి ఉండడం కూడా వారు అందంగా కనిపించడానికి కారణం అవుతోంది..

Related image

పెరిగిన అమ్మాయిల భావవ్యక్తీకరణ..

పూర్వ కాలంలో స్త్రీల సామాజిక స్థాయి తక్కువగా ఉండేది..వివాహం పిల్లలు మాత్రమే స్త్రీ జీవితానికి పరమావధిగా వారి మైండ్ సెట్ ను సెట్ చేసాయి ఆ నాటి సమాజాలు..ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాల్లోని స్త్రీలు చదువుకుంటున్నారు..సుమారు 34 సంవత్సరాల సగటు వయసు వచ్చే వరకూ చదువు కెరీర్ లతో బిజీగా ఉంటున్నారు..అంతే కాదు జీవితంలో తమ నైపుణ్యానికి తగిన కెరీర్ తో ముందుకు సాగుతున్నారు..ఇది అంతకు ముందులేని ఆత్మ విశ్వాసాన్ని తమ పట్ల తమకు భరోసా ఇస్తోంది..30 దాటిన మహిళలు అందంగా కనిపించడానికి ఇది కూడా కారణమవుతోంది..

ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..