ఒమన్ దేశం గురించి షాకింగ్ విషయాలు..

209

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కక్క పద్ధతి పాటిస్తారు. ఆయా దేశాల పరిస్థితుల వలన లేదా అక్కడ జరిగిన విపత్కర పరిస్థితుల వలన అలా నియమాలను పెట్టుకుంటారు. ఐతే కొన్ని దేశాల గురించి అక్కడ ఉండే విశేషాల గురించి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. అలాంటి కొన్ని వింత విశేషాలే ఒమన్ దేశంలో కూడా ఉన్నాయి. ఇది ఒక అరబ్ దేశం. అయినా కానీ మిగతా అరబ్ దేశాలలో ఉన్నట్టు ఇక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు. మరి ఆ దేశం విశేషాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for omana girls
 • ఒమన్‌ దేశం.. అరేబియాకు ఆగ్నేయ తీరంలో ఉంటుంది. దీనికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, యెమెన్‌ సరిహద్దు దేశాలు. మన తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దగా ఉండే ఈ దేశంలో హైదరాబాద్‌లో ఉండే జనాభా కంటే తక్కువగానే ఉంటారిక్కడ. ఒమన్ దేశంలో అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్. ఇక్కడి కరెన్సీ ఒమని రియాల్‌. జనాభా, 44 లక్షల 41 వేలు. విస్తీర్ణం 3 లక్షల 9,500 చదరపు కిలోమీటర్లు. దీని రాజధాని మస్కట్.
 • ఈ దేశానికి చక్రవర్తి సుల్తాన్ కబుజ్ సయీద్. ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లుగా ఇతని కుటుంబమే ఏలుతుంది. ఈ చక్రవర్తినే ఆర్మీకి, సెంట్రల్ బ్యాంక్ కూడా చైర్మన్ గా ఉన్నాడు. పాలనా నిర్వహణకు సుల్తానే మంత్రి మండలిని నియమిస్తాడు. ఒమన్ దేశం ఇంత డెవలప్ అయ్యిందంటే కారణం ఇతనే అని ఆ దేశ ప్రజలందరూ నమ్ముతారు.
Image result for omana girls
 • సౌదీ అరేబియా లాగానే ఈ దేశంలో కూడా ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ దేశం మొత్తం మీద 4.7 % భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలం ఉంటుంది. ఈ దేశంలో రాజరిక పాలన అమలులో ఉంటుంది. ఈ దేశానికి 1650 లో పోర్చుగీస్ నుంచి స్వాతంత్రం వచ్చింది. అరబ్ దేశాలలో స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటి దేశం ఇది.
 • ‘ప్రపంచ ఉగ్రవాద సూచీ’ ప్రకారం ఉగ్రవాద ప్రభావం లేని రెండు దేశాల్లో ఇదొకటి. మరోటి ఖతార్‌. ఇక్కడ నేరాల సంఖ్య కూడా చాలా తక్కువ. ఇక్కడ మహిళలకు ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు. కేవలం శరీరం అంతా కనిపించకుండా బట్టలు వేసుకోవాలంటే రూమ్ మాత్రమే ఉంది.
 • ప్రపంచంలోనే అతి ఫెమస్ అయినా సెంట్ అమౌగిని తయారుచేసే దేశం ఒమన్.
 • 2014 లో వేసిన లెక్కల ప్రకారం డెవలప్ అవుతున్న మొదటి 40 దేశాలలో ఇది మొదటి స్థానంలో ఉంది.
Image result for omana girls
 • ఈ దేశంలో ఆదాయపు పన్ను ఉండదు. సాంఘిక రక్షణ కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందంతే. రెస్టారెంట్లలో సర్వర్లకు ‘టిప్‌’ ఇచ్చే పద్ధతి ఇక్కడ లేదు.
 • ఈ దేశంలోని ఇబ్రా నగరంలో ప్రతి బుధవారం ఆడవారికే ప్రత్యేకమైన సంత ఉంటుంది. సూక్‌గా పిలిచే ఈ బజార్లో అమ్మేవారు కూడా ఆడవారే ఉంటారు. దీని చుట్టుపక్కలకు కూడా మగవారు రాకూడదు.
 • ఇప్పుడు వందలాది విలాసవంతమైన హోటళ్లతో ఉండే ఒమన్‌ లో 1970 వరకు ఒక్క హోటల్‌ కూడా లేదట. టూరిస్టులకు ఇబ్బంది అవుతుంది అని 1970 లో మొట్టమొదటి హోటల్ ను నిర్మించారు.
 • ఒమన్‌ మధ్యభాగం చాలావరకు విశాలమైన ఎడారి. తీర ప్రాంతంలో వందల కిలోమీటర్ల వరకు పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. వీటిలో జబల్‌ అఖ్దర్‌, జబల్‌ షామ్స్‌ ఎత్తయినవి.
 • ప్రపంచంలో ఉగ్రవాదం లేని రెండు దేశాల్లో ఇదొకటి. మరోకటి ఖతార్‌. ఈ దేశంలో చదువుకున్నవాళ్ళు కూడా ఎక్కువ. మొత్తం 92 శాతం మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు.
 • ఈ దేశంలో మొట్టమొదటి యూనివర్శిటీ సుల్తాన్ ఖబుజ్ యూనివర్సిటీ. ఇది 1956 లో స్థాపించబడింది.
 • ఈ దేశంలో పురాతన క్లాక్ టవర్ అని ఒక పురాతన మౌనమెట్ ఉంది. ఈ దేశంలో అన్నిటికంటే పురాతనమైనది ఇదే. ఈ ప్రాంతంలో బిల్డింగ్స్, రోడ్స్ అన్ని అభివ్రుది చెందినా ఆ క్లాక్ టవర్ మాత్రం అలాగే ఉంది.
 • ఈ దేశంలో చమురు నిల్వలు చాలా ఎక్కువ. 2000 సంవత్సరం నుంచి రోజుకు ఇక్కడ 90,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది. ఒక్కో బ్యారెల్‌లో దాదాపు 160 లీటర్ల చమురు పడుతుంది.
 • ఈ దేశంలో ఆల్కహాల్ తక్కువ. ఇక్కడ ఆల్కహాల్ అమ్మాలన్నా, కొనాలన్నా కూడా లైసెన్స్ ఉండాలి. ఎవరికీ అయితే లైసెన్స్ ఉంటుందో వారికే ఆల్కహాల్ అమ్ముతారు. ఇక్కడ స్మోకింగ్ అనేది చాలా కామన్. మన దేశంలో హుక్కాలు ఎలా ఉంటాయో అక్కడ హాజీజాలు ఉంటాయి. అలాగే వీటిని అక్కడ హబ్లి పబ్లి అని కూడా పిలుస్తారు.
 • ఇక్కడ ఎంతో ఫెమస్ అయినా మసీద్ ద సుల్తాన్ ఖబుజ్ గ్రాండ్ మసీద్. ఇన్ మసీద్ మొత్తం సుమారుగా 3 లక్షల టన్నుల బరువు ఉన్న ఇండియా సాండ్ స్టోన్ తో కట్టబడింది. ఈ మసీద్ కు కట్టడానికి సుమారుగా 6 సంవత్సరాల 4 నెలలు పట్టిందంట.

ఇలా చెప్పుకుంటూపోతే ఈ దేశం గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరి ఒమన్ దేశం మీద మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.