భారత దేశంలో అత్యంత్య ప్రమాదకరమైన రాష్టం నాగలాండ్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు..

511

మన దేశంలో ఎన్నో రాష్టాలు ఉన్నాయి.ఒక్కొక్క రాష్టానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.ఒక్కొ రాష్ట ప్రజలు ఒక్కొక్క నియమ నిబంధనలను ఒక్కొక్క పద్దతిని పాటిస్తారు.మనకు కొన్ని రాష్టాల పద్దతులు ఆచారాలు తెలుసు.అయితే మీకు నాగాలాండ్ రాష్టం గురించి తెలుసా..అక్కడ ఉన్న జాతుల గురించి వారి పద్ధతి ఆచారాల గురించి తెలుసా..తెలియదు కదా.అందుకే మీకోసం ఇప్పుడు ఆ రాష్టం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for nagaland

నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాలు మరియు మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా.నాగాలాండ్ డిసెంబర్ 1, 1963 న రాష్ట్రముగా అవతరించింది.ఈ రాష్టం జనాభా 19 లక్షలు మాత్రమే.జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగ తెగలకు చెందినవారే.ఇక్కడ వివిధ జాతుల వారు ఉన్నారు.ఆవో,అంగామీ,సుమీ,లోథా,రెగ్మా,కొన్యాక్,సంగ్తం,ఫోమ్,చాంగ్,ఇమ్చుంగర్,కియామిగిటం చకేసాంగ్,జెలియాంగ్,పోచురీ లాంటి ఎన్నో ట్రైబ్స్ ఈ రాష్టంలో ఉన్నాయి.ఒక్కొక్క జాతి వారు వారికి తగ్గ భాష డ్రెస్ ను కలిగి ఉన్నారు.

Image result for nagaland

ఈ కారణం వలనే నాగాలాండ్ లో అందరు ఒకే బాషను మాట్లడరు.వీరు ఇక్కడ అనేక రకాల పండుగలను జరుపుకుంటారు.ఇక్కడి తెగలకు చెందినా వారు ఎక్కువగా కాళ్ళకు కడియాలు వేసుకుంటారు.అయితే అలా ఎందుకు వేసుకుంటారని వారిని అడిగితే చెట్లు ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాం అని చెప్తారు.ఈ రాష్టంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు.ఎక్కువగా వరి,మిలేట్,మైజా,షుగర్ కేన్,పొటాటో వంటి పంటలను పండిస్తారు.నాగాలాండ్ లో బొగ్గు లైమ్ స్టోన్,ఐరన్,కోబాల్ట్,క్రోమియం వంటి ఎన్నో నిక్షేపాలు ఉన్నాయి.నాగాలాండ్ లోని డిమాపూర్ షుగర్ మిల్ లో ప్రతిరోజు దాదాపు వెయ్యి టన్నుల షుగర్ ను తయారుచేస్తారు.

Related image

ఈ రాష్టంలో చదువుకున్న వారు దాదాపు 80 శాతం మంది ఉంటారు.అక్షరాస్యతలో 9 వ స్థానంలో ఉంది.ఇక్కడి అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్.ఎక్కువగా చదువుకున్న వారు ఉండడం వలన ఇంగ్లిష్ ను అఫీషియల్ లాంగ్వేజ్ గా ప్రకటించారు.ఇంగ్లీషే కాకుండా ఆవో, కన్యో, అంగామీ,సీమా,లోథా,అనే ప్రాంతీయ భాషలను కూడా మాట్లాడతారు.ఈ రాష్టంలో మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి.60 అసెంబ్లీ సీట్స్ ఒక లోక్ సభ ఒక రాజ్య సభ సీట్ ఉంది.నాగాలాండ్ ఎక్కువగ కొండలు అడవులతోనే నిండి ఉంటుంది.నాగాలాండ్ లో టెస్టర్ సిస్టర్స్ అని పిలువబడే వారు నాగాలాండ్ రాష్టనికే ఫేమస్ గా పిలవబడుతున్నారు.మెర్సీ,అజీ,కుకు,లులు అని పిలువబడే నలుగురు సిస్టర్స్ మ్యూజికల్ గ్రూప్ గా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.ఆ నలుగురు సిస్టర్స్ నాగాలాండ్ లోని చెకిశాంగ్ ట్రైబ్ కు చెందినా వారు.వారు పాడిన అనేక పాటలు చాలా ఫేమస్ అయ్యాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారు ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందారు.వారు 2012 లో ట్రై బ్లేజర్ అవార్డ్ ను గెలుచుకున్నారు.మనం ఎవరైనా కుక్క మాంసం తింటుంటే ఎలాగో చూస్తాం కానీ నాగాలాండ్ లో అలా ఎవ్వరు ఫీల్ అవ్వరు.నాగాలాండ్ లో కుక్క మాంసాన్ని రిలిజియస్ ఫుడ్ గా భావిస్తారు.మనకు ఇక్కస కబాబ్స్ దొరికినట్టు నాగాలాండ్ లో కుక్క మాంసంతో చేసిన కబాబ్స్ దొరుకుతాయి.అయితే ఇలా ఎందుకు తింటారు అంటే మా నాగా సంస్కృతి అని చెబుతారు.కొన్ని దశాబ్దాలుగా ఈ పద్దతిని నాగలాండ్ వారు పాటిస్తున్నారు.నాగాలాండ్ లో ఒక భయంకరమైన అటవీ తెగ జాతీ మనుషులు ఉంటారు.అందుకే నాగాలాండ్ లో కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి పర్యాటకులకు నిషేధం విదించారు.ఇవేనండి నాగాలాండ్ రాష్టం గురించి కొన్ని ముఖ్య విషయాలు.మరి ఈ రాష్టం గురించి అలాగే ఇక్కడ ఉన్న జాతుల గురించి అక్కడి ప్రజలు అవలంబిస్తున్న పద్దతులు ఆచారాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.