అభినందన్ ముఖంపై గాయాలకు కార‌ణం తెలిసి షాకైన ఇంటెలిజెన్స్ అధికారులు

322

పాకిస్థాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ సెంట్రల్‌ మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లో చికిత్స పొందుతున్నారు. త్రివిధ దళ ఉద్యోగులకు ఇక్కడ ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తారు. అభినందన్‌ భారత్‌కు వచ్చిన సమయంలో ఆయన ముఖంపై గాయాలున్నాయి. భారత్‌కు తీసుకొచ్చే క్రమంలో ఇప్పటికే ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. కూలింగ్‌ డౌన్‌ ప్రాసెస్‌ కింద అభినందన్ కు ఆదివారం పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక అభినందన్ ను ఆయన కుటుంబసభ్యులు, ఐఏఎఫ్‌కు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు కలుసుకున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం అభినందన్ ను పరామర్శించారు. దేశం మొత్తం ఆయన చూపిన ధైర్యసాహసాలను కొనియాడిందని, గర్వంగా భావించిందని అభినందన్‌కు తెలిపారు నిర్మలా సీతారామన్‌.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక పాక్‌లో ఉన్న 60 గంటలు తాను ఎలా గడిపాననే వివరాలను కేంద్రమంత్రికి వివరించారు అభినందన్‌.అంతకుముందు అభినందన్ ను ఇంటెలిజెన్స్ యూనిట్ విచారించింది. ముందుగా ఆయనకు ఢిల్లీలోని ఆర్.ఆర్. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అభినందన్ శారీరకంగా ఫిట్‌గా ఉన్నారా..? లేదా..? అని పరీక్షించారు. ఆయన దుస్తుల్లో గానీ, శరీర భాగాల్లో గానీ ఏమైనా చిప్‌లు అమర్చారా అనే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి శరీరం మొత్తాన్ని స్కాన్‌ చేశారు. మరోవైపు పాకిస్థాన్‌లో బందీగా ఉన్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ ఆర్మీ మానసికంగా వేధించినట్లు సమాచారం. శారీరకంగా పెద్దగా ఇబ్బంది పెట్టనప్పటికీ, సైకలాజికల్‌గా హింసించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత అధికారులకు అభినందన్ చెప్పినట్లు తెలుస్తోంది.మరోవైపు అభినందన్‌కు శారీరక పరీక్షలతో పాటు సైకలాజికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది.? పాకిస్థాన్ అధికారులు, అభినందన్‌కు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారు? ఎలాంటి ఆహార పదార్థాలు అందించారు..? దేశ రహస్యాలను తెలుసుకోవడానికి ఏమైనా మెడిసిన్స్ గానీ, ఇతర పదార్థాలేవైనా ఇచ్చారా..? అనే కోణాల్లో అభినందన్‌ను అధికారులు విచారించనున్నారు.

Image result for abhinandan

ఫిజికల్, మెంటల్ టెస్టులు తర్వాత ఇంటెలిజెన్స్‌, రా అధికారులు కూడా అభినందన్‌ను ప్రశ్నిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో IAF ఇంటెలిజెన్స్‌ విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అభినందన్‌ పాక్‌ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, ఆయనంటే గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి కొన్ని అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పు డు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్‌ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? అన్న కోణంలో విచారించనున్నారు.శత్రు దేశానికి వెళ్లి తిరిగొచ్చిన ప్రతి సైనికునికి ఇలాంటి పరీక్షలు సాధారణమే. శారీరక, మానసిక పరీక్షలతో కలిపి 5 పరీక్షలను ప్రతి జవాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటలిజెన్స్ విభాగం సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని ఐఏఎఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి.