కండోమ్‌ బదులు ప్లాస్టిక్ కవర్ వాడారు.. చివరికి ఏమైందో తెలిస్తే కళ్ళు బైర్లుకమ్ముతాయి

467

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కన్నా ఎక్కువ కండోమ్’లను తయారుచేసే బ్రాండులు అందుబాటులో ఉన్నాయి. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు. లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే కండోమ్ బదులుగా సెక్స్ చేసే సమయంలో వేరే దానిని వాడితే ఏం జరుగుతుంది చెప్పండి. వేరే దానిని అంటే ఏదో అనుకోకండి. ప్లాస్టిక్ కవర్ ను వాడితే ఏమవుతుంది చెప్పండి. ఏమో మాకేమి తెలుసు అంటారా. .అయితే అలా వాడిన ఒక జంటకు ఏమైందో ఇప్పుడు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for romance

వియత్నాంలోని హనోయ్ ప్రాంతానికి చెందిన ఓ జంట మెడికల్ షాప్‌కు వెల్లి కండోమ్ కొనుగోలు చేయడానికి సిగ్గుపడ్డారు. దీంతో, గదిలో ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను కండోమ్‌లా వాడేద్దామని డిసైడ్ అయ్యారు. అంగ ప్రవేశానికి పెద్దగా ఇబ్బంది కలగకపోవడంతో పని సాఫీగానే మొదలైంది. ఆ మూడ్‌లో కవర్ వల్ల కలిగిన నష్టం తెలియలేదు. చివర్లో చాలా మంటగా ఉందని చూసుకునేసరికి ఇద్దరి మర్మాంగాలకు గాయాలు కనిపించాయి. ప్లాస్టిక్ కవర్ రాపిడి వల్ల జననేంద్రియలకు గాయాలయ్యాయి. దీంతో ఇద్దరూ ఆసుపత్రికి పరుగులు పెట్టారు. వారు చేసిన ఆ పనికి వైద్యులు ఆశ్చర్యపోయారు. సెక్స్‌కు ప్లాస్టిక్ కవర్లను వాడటం అశాస్త్రీయమని, ఇంకెప్పుడూ అలా చేయొద్దని వైద్యులు ఆ జంటకు సూచించారు. ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా వారి జననేంద్రియలకు యాంటిబయోటిక్స్ రాశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

వియత్నాంలో యువతకు సెక్స్ నాలెడ్జ్ చాలా తక్కువని ఇటీవల ఓ సర్వే పేర్కొంది. హనోయ్ మెడికల్ యూనివర్శిటీ, హనోయ్ మెడికల్ కాలేజ్‌లు సంయుక్తంగా 2,700 మంది విద్యార్థులను కండోమ్ వాడకం గురించి ప్రశ్నించారు. వీరిలో 16 శాతం మంది మాత్రమే కండోమ్ వాడామని చెప్పారు. 25 శాతం మంది విద్యార్థులు కండోమ్ కొనాలంటే తమకు సిగ్గని తెలిపారు. అక్కడే కాదు, మన దేశంలో కూడా చాలామంది సెక్స్ పరిజ్ఞానం లేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. సెక్స్ అనేది సహజ ప్రక్రియ కండోమ్ స్త్రీ, పురుషులిద్దరికీ సురక్షితమే. సిగ్గుపడి రాజీపడితే లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి అందరు కండోమ్ వాడండి. మరి కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ ను వాడిన ఈ జంట గురించి తరువాతః జరిగిన దాని గురించి అలాగే కండోమ్ వాడకం ఎంత అవసరమో మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలియజేయండి.