భారత్ సంచలన నిర్ణయం పాకిస్ధాన్ లో మొదలైన ప్రకంపనలు ఉద్యమం

255

కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడుస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఎంతో ఉత్కంఠను చెలరేపిన అతి సున్నితమైన సంఘటనలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా వారం రోజులు గడిచిపోయింది. దీంతో గడిచిన వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ పేలకుండా ప్రశాంతంగా ప్రజలు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలు కశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పడానికి, కేవలం అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే నేతల ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా చేస్తున్నారు అనేది తెలుస్తోంది. నేరుగా ప్రజలు ఎవరూ రాలేదు.

Image result for modi and imran khan

కశ్మీర్‌లో 370 ఆర్టికల్ తోలగిస్తే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతాయి…, ముఖ్యంగా కశ్మీర్‌లో జనజీవనం స్థంభించి,ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.., ఈనేపథ్యంలోనే ఆర్టికల్స్ తొలగింపు సంధర్భంలో విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం కనీసం నెల రోజుల వరకు ఆసాధరణ పరిస్థితులు ఉంటాయని ముందే చెప్పి ఇంటికి పించించారు.దీనికి తోడు వేలాది మంది భద్రతా దళాలు అక్కడ పహార కాచాయి. దీంతో అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అనే అందోళన దేశవ్యాప్తంగా నెలకోంది. కాని అన్నీ పటాపంచలు అయ్యాయి.

Image result for modi and imran khan

భారత్ కు దాయాది దేశం పాక్ కు మధ్య ఎప్పుడు మండుతున్న చిచ్చుగా ఉన్న కాశ్మీర్ విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్దాన్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ని మరియు రాష్ట్ర హోదాను కోల్పోవాల్సి వచ్చింది. అధికరణ 370 రద్దుతో కాశ్మీర్ సమస్య దాదుపుగా ఓ కొలిక్కి వచ్చేస్తుంది అనే భయం పట్టుకున్న పాక్ ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిరూపించాలని చూసింది కానీ ప్రపంచమంతా భారత్ కు అండగా నిలవడంతో దాయాది దేశానికి షాక్ తగిలింది. అగ్రదేశమైన అమెరికా ఒక అడుగు ముందుకేసి పాక్ ఎలాంటి చొరబాట్లులకు పాల్పడవద్దని వార్నింగ్ ఇచ్చింది.

Image result for modi and imran khan

దానితో భారత్ ను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా పాక్ రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాన్ని వీలయినంత తగ్గించాలని, దౌత్య సేవలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయాన్ని తీసుకుంది.. అసలే ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న పాక్ పై ఈ నిర్ణయంతో మరింత భారం పడనున్నది. ఇప్పటికే అక్కడ బెలూచిస్తాన్ కావాలని వేర్పాటువాదుల చేస్తున్న ఉద్యమం పై పాక్ వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో ప్రపంచదేశాలలో పాక్ ప్రతిష్ట మంటగలిసింది. దానిని సరి చేసుకునే పనిలో పడిన పాక్ కు ఇప్పుడు అక్కడి ఒక ప్రాంతం వారు షాక్ ఇచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు ఇప్పుడు రోడ్ల పైకి వచ్చి తమకు పాక్ నుండి విముక్తి కావాలని కోరుతూ ఉద్యమం చేస్తున్నారు. దాని పై పాక్ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది.ఇది భారత్ తీసుకున్న నిర్ణయం వల్లే అని పాక్ ప్రభుత్వం భావిస్తుంది.పాక్ కంటే భారత్ ఎంతో మేలు అని అక్కడి వేర్పాటువాదులు అంటున్నారు.ఇప్పుడు భారత్ కాశ్మీర్ ను అభివృద్ది పదంలో నడిపితే పివోకే లోని ప్రజలు మనతో కలవాలని కోరతారు అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది మోడీ సర్కారుకు మంచి శుభవార్త అనే చెప్పాలి, ఓ పక్క కాంగ్రెస్ పేచీలు పెడుతోంది కొందరు దీనిని విమర్శిస్తున్నారు, కాని అక్కడ ప్రజలు మాత్రం తాము భారత్ లో కలుస్తాం అంటున్నారు. ఇది బీజేపీ సక్సెస్ అనే చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.