కాశ్మీర్ ఎఫెక్ట్ : కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్.. భారీగా పడిపోయిన రూపాయి ధర.. షాక్ లో మోడీ

145

జమ్ముకశ్మీర్‌ను విభజిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 10 వేల 800కి చేరింది. మరోవైపు రూపాయి విలువ భారీగా పడిపోయింది. 8 నెలల గరిష్టానికి రూపాయి మారక విలువ దిగజారింది. దీంతో యూరోపియన్ మార్కెట్లపై కూడా మోడీ ప్రభుత్వ నిర్ణయ వ్యతిరేక ప్రభావం చూపించింది. ఆర్టికల్ 370, 35ఏ సెక్షన్ రద్దు చేయడంతో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. అమెరికా డాలర్‌తో 70.60కి చేరింది. ఇదీ 8 నెలల గరిష్టానికి చేరిపోయింది. ఇదివరకు 69.60గా ఉన్న రూపాయి విలుగా మరో రూపాయి దిగజారి కనిష్టానికి చేరుకుంది. ఇదీ గత డిసెంబర్ తర్వాత ఎక్కువని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది.HDFC , TCS, NTPC, HCL టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లలో కొనసాగుతున్నాయి. ICICI, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్స్, DHLF, LIC హౌసింగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు చైనా యువాన్ కూడా డాలర్‌తో 7కి పడిపోయింది. ఇదీ కూడా దశాబ్దంలో మొదటిసారిని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై స్పస్టంగా కనిపించింది. మరోవైపు ఆరేళ్లలో బంగారం ధర గరిష్టానికి చేరిందని నిపుణులు చెప్తున్నారు.

Image result for stock market

స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్ నుంచే నష్టాల బాటన పయనించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లు నష్టపోయి మళ్లీ పుంజుకుని 1100 పాయింట్ల నష్టంతో 17,914 వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 390 పాయింట్లు అత్యధికంగా క్షీణించి 5,315 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 19వేల పాయింట్ల వద్ద ప్రారంభం అయిన కాసేపటికే 692.37 పాయింట్లు మేర సెన్సెక్స్ అత్యధికంగా నష్టపోయింది. విదేశీ మదుపుదార్లు తమ పెట్టుబడులను ఒక్కసారిగా ఉపసంహరించుకోవటంతో సెన్సెక్స్ భారీ పతనానికి కారణం అయినట్లు మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇంత భారీస్థాయిలో సెన్సెక్స్ పతనమైన దాఖలాలు తక్కువని పేర్కొంటున్నారు. సోమవారం మధ్యాహ్న సమయానికి మార్కెట్‌లో మొత్తం 2,729 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా, అత్యధికంగా 2,529 కంపెనీల వాటాలు నష్టాల దిశగా సాగుతున్నాయి. అలాగే 181 కంపెనీల వాటాలు లాభపడగా 19 కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి. మరి స్టాక్ మార్కెట్ ధరలు అమాంతం తగ్గిపోవడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.