breaking news : ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ సూసైడ్.. పరిస్థితి విషమం

526

వివాదాస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ అనూహ్యంగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-12లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అసలే కోపిష్టి అయిన శ్రీశాంత్‌కు ఓపిక కూడా కొంచెం తక్కువ.. ఈ తరహా ప్రవర్తనతో హౌస్‌లో అతను చేసే ప్రతిపని వివాదాస్పదం అవుతూ వస్తోంది. ఈ యాటిట్యూడ్‌తో అతనికి అభిమానులు బాగా కనెక్ట్‌ అయ్యారు. అయితే ఇటీవల హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శ్రీశాంత్‌ ఆసుపత్రిపాలైనట్లు తెలుస్తోంది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా..

Image result for sreesanth

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వార్తల్లో నిలిచాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 12 వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 12లో శ్రీశాంత్ కంటెస్టెంట్‌గా వున్నాడు. ఈ హౌస్‌లోకి కంటిస్టెంట్‌గా వెళ్లిన శ్రీశాంత్ మొదటి నుంచి తన ప్రవర్తనతో ఏదొక గొడవలకు కారణమవుతూనే వున్నాడు. ఇటీవల శ్రీశాంత్ హౌస్‌మేట్ సురభి రానాతో గొడవకు దిగాడు. ఇద్దరూ ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని అంటే.. ఆవేశానికి గురైన శ్రీశాంత్ సురభిని వ్యభిచారి అంటూ కామెంట్స్ చేశాడు. కానీ తొందరపడి అన్న మాటలకు పశ్చాత్తాపంతో సురభికి క్షమాపణలు చెప్పాడు. అనంతరం మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడానా? అని కుంగిపోయిన శ్రీశాంత్‌.. వాష్‌రూంలోకి వెళ్లి డోర్‌ పెట్టుకున్నాడు. ఇది గమనించిన తోటి హౌస్‌మేట్స్‌.. అతన్ని బయటకు రమ్మని కోరగా అతను నిరాకరించాడు. అనంతరం తన తలను గోడకేసి బాదుకోవడంతో గాయపడ్డాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గాయపడిన శ్రీశాంత్‌ని బిగ్ బాస్ నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు.శ్రీశాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘శ్రీశాంత్‌ను హాస్పిటల్‌కు తరలించారని తెలియగానే చాలా ఆందోళనకు గురయ్యా. అతను గాయంతో చాలా బాధపడటంతో హాస్పిటల్‌కు తరలించి ఎక్స్‌రే, తదితర వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్ హౌస్‌కు తిరిగి వెళ్లారు. ఎలాంటి ఆందోళన వద్దు. మీ అభిమానానికి, ప్రేమా అప్యాయతలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక శ్రీశాంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి చేరుకున్నాడు. ఇక శ్రీశాంత్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్‌పాలోయింగ్‌ పెరిగింది. సురభితో గొడవ నేపథ్యంలో అతనికి మద్దతుగా #WeStandBySreesanth అనే హ్యాష్‌ టాగ్‌తో మద్దతుగా నిలిచారు. ఒక అభిమాని అయితే ఏకంగా హౌస్‌ నుంచి బయటకు రాగానే సురభి గ్యాంగ్‌ రేప్‌కు గురవుతుందని హెచ్చరిస్తూ ట్వీట్‌ చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో సదరు అభిమాని ఆ ట్వీట్‌ తొలిగించి క్షమాపణలు కోరాడు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సురభికి శ్రీశాంత్ మధ్య జరిగిన వాగ్వాదం గురించి అలాగే శ్రీశాంత్ తలను గోడకు గుద్దుకోవడం గురించి అలాగే శ్రీశాంత్ అభిమానులు పెడుతున్న పోస్ట్ ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.