ఇండియన్ క్రికెట్ టీం సంచలన నిర్ణయం! వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో నో!

282

మొన్న జరిగిన పుల్వామా ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.

Image result for india vs pak

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించింది.అలాగే పాక్ కు తరలించే నీటిని కూడా రద్దు చేసే పనిలో ఉంది. ఆ నీటిని యమునా నదికి మరలించే పనిలో ఉంది భారత్. ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తుంటే సినిమా నటులు ఏమో పాకిస్థాన్ నటులను బహిష్కరించారు. ఏ ఒక్క పాక్ నటుడికి కూడా సినిమా అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యింది. సినిమా వాళ్ళు అయిపోయారనుకుంటే ఇప్పుడు క్రికెటర్స్ మరొక ప్రకటన చేశారు. ఇప్పటికే పాక్ తో క్రికెట్ ఆడటం మానేసిన భారత్ అప్పుడప్పుడు ప్రపంచకప్ లో లేదా ఆసియా కప్ లో మాత్రమే పాక్ తో కలిసి ఆడుతుంది. అయితే ఇప్పుడు దానిని కూడా వద్దు అనుకుంటుంది. ఏప్రిల్ లో ఇంగ్లాండ్ వేదికగా క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా, పాకిస్తాన్ తో తలపడనుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే క్రికెట్ మాజీలు పాకిస్తాన్ తో క్రికట్ ఆడి గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై అనుమానాలు మొదలయ్యాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇదిలా వుంటే పాకిస్తాన్ తో టీం ఇండియా క్రికెట్ ఆడే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తూ వున్నా బీసిసిఐ, ఇప్పటికే ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ని నిషేధించాలని ఐసిసి ని కోరింది. ఆయితే ఇప్పుడు ఊహించని విధంగా ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడం ద్వారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రపంచ కప్ లో టీం ఇండియా ఆడకపోతే నిర్వాకులకు భారీ నష్టాలు వస్తాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ ని ప్రపంచకప్ నుంచి నిషేధించడానికి మిగిలిన దేశాలు నిర్ణయం తప్పనిసరి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో క్రికెట్ ప్రపంచకప్ లో కూడా పాకిస్తాన్ ని ఒంటరి చేయడం ద్వారా ఆ దేశంపై తమ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి వరల్డ్ కప్ లో పాక్ తో కలిసి ఆడము అని బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం గురించి అలాగే ఇంకా ఏమేమి చేస్తే పాక్ కు బుద్ధి వస్తుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.