పాకిస్తాన్‌కు దిమ్మతిరిగింది, వెబ్‌సైట్లు అన్నీ హ్యాక్ చేసిన ఇండియా కుర్రాడు

299

పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 49మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అశువులుబాసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిపై యావత్ భారతావని భగ్గుమంటోంది.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ నినదిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పాక్ తీరును ఎండుగడుతున్నారు. అదే సందర్భంలో కొందరు దాయాది దేశంపై కొత్త తరహా యుద్ధాన్ని ప్రకటించారు. ఆ దేశ వెబ్‌సైట్లను హ్యాక్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు. ఆదివారం ఏకంగా 200కుపైగా వెబ్‌సైట్లు స్తంభింపచేశారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో భారీగా ట్రోల్ అవుతోంది.ఒక కుర్రాడి పేరు బాగా వినిపిస్తుంది. మరి ఆ కుర్రాడు ఎవరో ఏంటో పూర్తీగా తెలుసుకుందాం.

Image result for pulwama

అన్షుల్ సక్సేనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన పేరు వైరల్ అవుతోంది. ఎందుకంటే జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 40 మందికి పైగా జవాన్లు అమరులు కావడంతో.. అతను పాకిస్తాన్ పైన తనకు తెలిసిన విద్య ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన పలు వెబ్ సైట్లను హ్యాక్ చేశాడు.అన్షుల్ సక్సేనా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (లాహోర్)తో పాటు ఐదు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేశాడట. పాకిస్తాన్ స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌ను హ్యాక్ చేశాడు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లు హ్యాక్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పలువురు ఇండియన్ హ్యాకర్స్ పాకిస్తాన్ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ వెబ్ సైట్ హ్యాక్ అయింది. పాక్ పీఎం ఫోటోను వెబ్ సైట్ నుంచి తొలగించారు.ఈ సందర్భంగా అన్షుల్ సక్సేనా ట్వీట్ చేస్తూ… సీఆర్పీఎప్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో టెర్రరిస్టులపై సోషల్ మీడియా ద్వారా సానుభూతి చూపుతున్న వారి ట్వీట్స్, ఫేస్‌బుక్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తనకు పంపించాలని, తన ఈ మెయిల్‌కు పంపించాలని సూచించాడు. వాటిని కూడా హ్యాక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇదే సమయంలో అన్షుల్ సక్సేనా ఫేస్‌బుక్‌లో.. ఇండియన్ హ్యాకర్స్ అందరు కూడా మన దేశం సైబర్ సెక్యూరిటీ కోసం పని చేయాలని, దానిపై దృష్టి పెట్టాలని, చైనా, పాకిస్తాన్ హ్యాకర్స్ నుంచి మన ఇండియన్ వెబ్ సైట్లను కాపాడాలని పేర్కొన్నారు. అలాగే వారిపై సైబర్ దాడి చేయాలని కోరారు. అందరం ఇండియన్ హ్యాకర్లము ఒక్కచోటకు వద్దమని పేర్కొన్నారు. తాజాగా, పోస్ట్ పెడుతూ ఏ దేశద్రోహిని కూడా వదలవద్దని పేర్కొన్నారు. అన్షుల్ సక్సేనా దేశానికి, జవాన్లకు వ్యతిరేకంగా పోస్టులు చేసే వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘టీమ్ ఐ క్రూ’ గ్రూప్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసింది. హ్యాక్ అయిన వెబ్‌సైట్ల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాక్ చరిత్రలోనే ఇది పెద్ద సైబర్ ఎటాక్‌‌గా భావిస్తున్నారు. హ్యాక్ చేసిన వాటిలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట్లు ఉన్నాయట. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (లాహోర్)తో పాటు ఐదు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేశారట. పాకిస్తాన్ స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌.. పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ వెబ్ సైట్ హ్యాక్ అయింది. పాకిస్థాన్ విదేశాంగశాఖ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేశారు.హ్యాక్ అయిన కొన్ని వెబ్ సైట్లు ఇవే…మరి వీబీ సైట్లను హ్యాక్ చేసిన ఈ కుర్రాడి గురించి అలాగే అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికి పిలుపునివ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.