ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తున్న ఆంటీ

245

సోషల్ మీడియాలో అంతే కొత్తగా ఏదైనా మొదలైతే అందరూ అదే ఫాలో అవుతారు. చివరకు అదో ట్రెండ్‌గా మారిపోతుంది. ఎక్కడ చూసినా దానిగురించే చర్చ మొదలవుతుంది. ఐస్‌ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, కీకీ ఛాలెంజ్… ఇలాంటివన్నీ అలా ట్రెండ్ సృష్టించినవే. ఒకదాని తర్వాత మరో ట్రెండ్ వస్తూనే ఉంటుంది.ముఖ్యంగా ‘కికీ చాలెంజ్‌’.. ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తూ వారిని నడిరోడ్లపై నాట్యం చేయిస్తూ పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ‘ఈ చాలెంజ్‌ చాలా ప్రమాదకరం’ అని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తోన్న వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. యువతరం మొదలుకొని సెలబ్రిటీస్‌ వరకూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. కాగా ఇప్పుడు వీరి కోవలోకి ఒక వడోదర ఆంటీ చేరారు.

Image result for aunty viral dance

సెలబ్రెటీలు చేసిన కికీ డ్యాన్స్‌ కంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ఆంటీ డ్యాన్సే ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. కికీ పుణ్యామా అని కేవలం ఒక్క రోజులోనే కావాల్సినంత పబ్లిసిటీ దక్కించుకోని పాపులర్‌ అయ్యారు ఈ వడోదర ఆంటీ. కానీ ఈ వెర్రి ఇక్కడకు కూడా పాకడంతో తలలు పట్టుకుంటున్నారు వడోదర పోలీసులు. దాంతో సదరు వీడియోలో ఉన్న ఆంటీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.వడోదరకు చెందిన మధ్య వయస్కురాలైన రిజ్వానా మిర్‌ కికీ చాలెంజ్‌లో భాగంగా ‘ఇన్‌ మై ఫిలింగ్స్‌’ సాంగ్‌కు డాన్స్‌ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేశారు. కికీ సాంగ్‌కు ఈ ఆంటీ వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘వాహ్‌ ఆంటీ.. ఏం ఎనర్జీ, అద్భుతంగా డాన్స్‌ చేస్తున్నారు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లకు నచ్చిన ఈ ఆంటీ డ్యాన్స్‌, పోలీసులకు మాత్రం వణుకు పుట్టిస్తోంది.దాంతో వడోదర పోలీసులు ఈ వీడియోపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అంతేకాక ఇలాంటి ప్రమాదకర చాలెంజ్‌లు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కికీ చాలెంజ్‌ మీద పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.కికీ చాలెంజ్‌ అనే ఈ ఇంటర్‌నెట్‌ సంచలనానికి మరో పేరు ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’. డ్రేక్‌ గ్రాహం అనే 24 ఏళ్ల కెనడియన్‌ యువ గాయకుడు ఇటీవల విడుదలైన తన ‘స్కార్పియన్‌’ ఆల్బంలోని ‘ఇన్‌మై ఫీలింగ్స్‌’ అనే పాటలో ‘కికీ డూ యూ లవ్‌ మీ’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ పాటకీ, ‘కికీ చాలెంజ్‌’కీ ఏ సంబంధమూ లేదు. ఇంటర్‌నెట్‌ కమెడియన్‌ షిగ్గీ ఈ పాటకు డాన్స్‌ చేసి దాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయడంతో వేలాది మంది అనుసరిస్తున్నారు. మరి కికి ఛాలెంజ్ గురించి అలాగే పోలీసులకు తలనొప్పిగా తయారైన ఈ ఆంటీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.