2050 నాటికి మనదేశం ఎలా ఉండబోతుంది.

208

ఓ యాబై ఏళ్లు, వందేళ్లు, వెయ్యేళ్ల తర్వాత మనిషి జీవితం ఎలా ఉండబోతుందో చాలా ఇంట్రెస్టింగ్.. ఓ టైం మిషన్ కొన్ని సంవత్సరాల వెనక్కి, అలాగే కొన్ని సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్లి అప్పటి కాలం ఇలా ఉండేది, ఇలా ఉండబోతుంది అని చెబుతూ తెలుగులో తీసిన ఆదిత్య 369 సినిమా ఎంత హిట్టు కొట్టిందో తెలిసిందే. ఇప్పుడు మనిషి జీవితం సమస్థం యాంత్రికమే.. టెక్నాలజీ ని అభివృద్ది చేసుకుంటూ హైటెక్ యుగంలో ప్రపంచం జెట్ స్పీడ్ తో ముందుకి సాగిపోతోంది. ఈ హై టెక్నాలజీ పై ఆధారపడే జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో? కొన్ని సర్వేలు, కొందరు నిపుణుల అంచనాలు భలే ఆసక్తికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా 2050 సంవత్సరం నాటికి భారత్ మనుగడ ఎలా ఉంటుందో?నిపుణులు చెబుతున్నారు.మరి వారు చెప్పిన దాని ప్రకారం భారత్ 2050 ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా.

Image result for future in india 2025

ప్రైస్ వాటర్ కూపర్ అనే సంస్థ ప్రపంచ దేశాల ప్రస్తుత పరిస్థితులను బట్టి భవిష్యత్ ను అంచనా వేస్తుంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం 2050 నాటికీ ప్రపంచంలో భారత్ ఆర్థికంగా రెండవ స్థానంలో ఉంటుంది. మన జీడీపీ అమెరికా కన్నా ఎక్కువ ఉంటుంది. గ్రామాలన్నీ దగ్గరలో ఉన్న నగరాలలో పట్టణాలలో కలిసిపోతాయి.గ్రామీణ భారత్ పట్టణ భారత్ గా మారిపోతుంది. ఇప్పుడున్న ఢిల్లీ ముంబై హైదరాబాద్ మెగా మెట్రో పాలీ సిటీస్ గా మారిపోతాయి. వ్యవసాయం తగ్గి అంతటా పెద్ద పెద్ద భవనాలు వెలుస్తాయి. ఎక్కడ చూసి స్కై క్రాపర్స్ కనపడతాయి. భవిష్యత్ లో వీటిలోని వ్యవసాయం నడుస్తుంది. హైటెక్ వ్యవసాయం నడుస్తుంది.మట్టితో కాకుండా హైడ్రో పాలిక్స్ ద్వారా వ్యవసాయం నడుస్తుంది. సగం విద్యుత్ సౌర శక్తితోనే నడుస్తుంది. కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. మన దేశానికి సొంత నేవిగేషన్ సిస్టమ్ వస్తుంది.ఇప్పుడు మనం వాడుతున్నది అమెరికా gps సిస్టమ్. 2050 నాటికీ మన ips వస్తుంది.రవాణాలో కూడా చాలా మార్పులు వస్తాయి.అన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎక్కువ అవుతుంది. కాస్త ధనవంతులు అయితే ఎగిరే కార్లలో విహరిస్తుంటారు. వచ్చే 30 ఏళ్లలో లారీలు ట్రక్స్ కూడా కరెంట్ తోనే నడుస్తాయి. డ్రైవర్ అవసరం లేని వాహనాలు అందుబాటులోకి వస్తాయి.

ఈ క్రింది వీడియో ని చూడండి

రోన్స్ ద్వారా సరుకులను డోర్ టూ డోర్ చేస్తారు. అగ్గిమెంటల్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఇప్పటివరకు ఊహలలోనే ఉన్నాయి.కానీ 30 ఏళ్లలో అవి నిజం కాబోతున్నాయి. వర్చువల్ రియాలిటీతో మొబైల్ ఫోన్ అవసరం ఉండదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రంగం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ కేంద్ర బిందువు అవుతుంది. బెంగుళూర్ నగరం వీటన్నిటికీ కేంద్రంగా ఉంటుంది. అడ్వాన్స్ త్రీడి సిస్టమ్ ద్వారా చాలా చౌకగా కార్ల తయారీ ఉంటుంది. ఇస్రో వరల్డ్ లో నెంబర్ 2 స్థానంలోకి వెళ్తుంది. 2050 నాటికీ మార్స్ మిషన్ కు ఇస్రో కంప్లీట్ చేస్తుంది. న్యూరాలింగ్ అనే సిస్టమ్ వస్తుంది.ఇది మనిషి నాడి వ్యవస్థను కంప్యూటర్ నాడి వ్యవస్థతో అనుసంధానం చేస్తారు.మీరేం చెయ్యాలనుకున్నారో ఆలోచిస్తే చాలు జరిగిపోతాయి.

Image result for india population

వైద్య రంగం చాలా ముందుకు వెళ్తుంది.క్రిస్టో కరెన్సీని లీగల్ చేస్తుంది.ప్రపంచంలో మూడవ ధనిక దేశంగా మారుతుంది.జనాభాలో నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది. ఇద్దరు కంటే ఎక్కవ పిల్లలు ఉండకూడదనే నియమ వస్తుంది. ఇండియన్ ఆర్మ్ రోబోలతో పటిష్టంగా మారుతుంది. వీడియో గేమ్స్ తయారుచేసే వాళ్లకు మిలిటరీలో జాబ్స్ ఇస్తారు. రిమోట్ తో రోబోలను కంట్రోల్ చేసి ఇండియన్ ఆర్మీ నడుస్తుంది. యుద్ధ భూమిలో రక్తపాతం అనేదే ఉండదు. ప్రపంచానికి భారత్ సూపర్ పవర్ గా మారుతుంది.ఇవన్నీ నెరవేరాలని కోరుకుందాం.ఇప్పుడు ఉన్న ఆకలి సమస్యలు నిరుద్యోగం అవినీతి నల్లడబ్బు లాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరికే రోజు దగ్గరలోనే ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.మరి ఈ అంశం మీద మీరేమంటారు.2050 నాటికీ భారత్ ఎలా తయారవుతుందో మేము చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.